హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎఎస్ ఎల్వీకి కోర్టు సమన్లు, 18 హాజరుకు ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

LV Subrahmaniam
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సిబిఐ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆయనను ఆదేశించింది. ఈ కేసులో నిందితుడైన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను ఈ నెల 18వ తేదీన తమ ముందు హాజరు పరచాలని సిబిఐ కోర్టు చంచల్‌గుడా జైలు అధికారులను ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో బిపి ఆచార్యను సిబిఐ అధికారులు అరెస్టు చేసింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం మాత్రం బయటనే ఉన్నారు.

ఎమ్మార్ కేసులో నిందితులు, ఐఎఐస్ అధికారులు బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యంలపై ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఐఏఎస్ అధికారులపై అవినీతి నిరోధక (పీసీ) చట్టం కింద కేసులు నమోదైతే వాటి విచారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నిబంధన వారికి రక్షణ ఛత్రంగా నిలుస్తోంది. సిబిఐ విచారణకూ ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నిబంధన కారణంగానే బిపి ఆచార్య, ఎల్వీలపై విచారణ పెండింగ్‌లో పడింది. దీంతో, కేంద్రంలో ఏం జరుగుతోందో తెలియడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదంటూ సిబిఐ అధికారులు కోర్టుకే తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కనీసం ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు అయినా అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేసింది.

వాటిని పరిశీలించిన కోర్టు ఐపిసి సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు నిబంధనలు ఏమీ అడ్డుగా లేవని భావించి వాటిపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నాంపల్లి సీబీఐ ప్రిన్సిపల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోఎమ్మార్ కేసులో తొలి నిందితుడు బిపి ఆచార్యపై ఐపీసీ 120-బీ (నేరపూరిత కుట్ర), 409 (అధికార దుర్వినియోగం) కింద విచారణ మొదలు కానుంది. ఎల్వీ సుబ్రమణ్యంపై 120-బీ కింద మాత్రమే సిబిఐ అభియోగాలు మోపింది.

English summary
CBI court has summoned IAS officer LV Subrahmaniam to present before it on June 18. Court has permitted CBI to prosecute IAS officers BP Acharya and LV Sunrahmaniam in EMAAR properties case. BP Acharya was arrested in EMAAR case and is accused number one in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X