హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మకు మగ పోలీసుల తనిఖీలా: శంకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, ఆమె తనయ షర్మిల సూటుకేసులను మగ పోలీసులు తనిఖీ చేయడం మంచిది కాదని మాజీ మంత్రి శంకర రావు సోమవారం అన్నారు. పోలీసుల అత్యుత్సాహం వల్లనే ఇది జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులను కట్టడి చేయాలని సూచించారు. షర్మిల, విజయమ్మల సూటుకేసులు తనిఖీ చేసేందుకు వారేమైనా సంఘ విద్రోహ శక్తులా అని ప్రశ్నించారు.

ఎమ్మార్ కేసులో అక్రమాలకు కెవిపి రామచంద్ర రావు సూత్రదారి అని ఆరోపించారు. ఆయనను సిబిఐ విచారించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు కోర్టు పరిధిలో ఉందని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి జగన్ నేరాలు రుజువైతే పద్నాలుగేళ్ల శిక్ష పడుతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలు పార్టీని నష్టం చేకూరుస్తాయన్నారు.

కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పర్యటన ఉప ఎన్నికల సమయంలో పార్టీకి చాలా ప్లస్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన పర్యటన వల్ల పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్నారు. ఆయన మరో నాలుగు రోజులు ఉంటే పార్టీ ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు.

మరోవైపు వైయస్ విజయమ్మ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే తెలంగాణలో పర్యటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు. జగన్ అసలు జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరి చెప్పాలని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు రావాలంటే వీసా కావాలా అని గతంలో వ్యాఖ్యానించారని, వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వీటికి సమాధానాలు చెప్పాకే వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటించాలని సూచించారు. జగన్ ఏ ఉద్యమాలో చేసి జైలుకు వెళ్లలేదన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్‌ను జైలుకు పంపితే విజయమ్మ గగ్గోలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అవినీతి గురించి సీమాంధ్రలో పట్టించుకోకపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం పూర్తి అవగాహనతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ ప్లకార్డులు పట్టుకున్న విషయం ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదని గుర్తు చేశారు.

విజయమ్మ ఏ వీసాతో పరకాలకు వస్తున్నారో చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీని భారతీయ జగన్ పార్టీగా మార్చుకోవాలని సూచించారు. పరకాలలో కొండా సురేఖను గెలిపించేందుకే బిజెపి పోటీ చేస్తుందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గల్లీ లీడర్‌గా పరకాలలో తిరుగుతున్నారన్నారు. అన్ని పార్టీలు కలిసి తెరాసను లక్ష్యంగా చేసుకున్నాయని మండిపడ్డారు.

English summary
Former minister Shankar Rao responded on police checking of YSR Congress party respectory president and Pulivendula MLA YS Vijayamma and her daughter YS Sharmila. He demanded CBI to question KVP Ramachandra Rao in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X