వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో అల్ ఖైదా నెంబర్ టు అల్ లిబి మృతి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abu Yahya al-Libi
ఇస్లామాబాద్: అల్ ఖైదా నెంబర్ అబు యాహ్యా అల్ లిబి మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒసాబా బిన్ లాడెన్ మృతి అనంతరం అల్ జవహరి అల్ ఖైదాలో చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. జవహరి తర్వాత అబు యాహ్యా అల్ లిబి అల్ ఖైదాలో కీలక వ్యక్తి. ఇతను మృతి చెందినట్లుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇతను మృతి ధృవీకరించబడితే అల్ ఖైదా కీలక వ్యక్తిని కోల్పోయినట్లే భావించవచ్చు.

అమెరికా దళాలు బిన్ లాడెన్‌ను చంపేసిన తర్వాత అల్ ఖైదాకు ఇంత పెద్ద దెబ్బ తగలడం ఇదే అవుతుంది. అమెరికా తెలిపిన వివరాల ప్రకారం.. అబు యాహ్యా లిబియన్ వ్యక్తి. ఇతను కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇతను పలు డ్రోన్ దాడులలో కీలకంగా వ్యవహరించాడు. ఇతని అసలు పేరు మొహమ్మద్ హసన్ ఖయిదా. మాజీ ఈజిప్ట్ డాక్టర్ అల్ జవహరి తర్వాత అల్ ఖైదాలో రెండో వ్యక్తి.

లిబితో సహా మరో ఏడుగురు విదేశీ తీవ్రవాదులు సోమవారం మృతి చెందినట్లుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని తెలుస్తోంది. తాము తీవ్రవాదుల మధ్య జరిగిన చర్చను టెలిఫోన్ ద్వారా విన్నామని, అందులో వారు షేఖ్ మృతిపై మాట్లాడారని చెప్పారని తెలుస్తోంది. వారు అసలు పేరును ఉచ్చరించలేదని, దీంతో తాము ఆ పేరును పరిశీలించామని, అది లిబి పేరే అని తేలిందని, దీంతో అతను మృతి చెందినట్లుగా తాము భావిస్తున్నామని చెప్పారని తెలుస్తోంది.

కాగా ఏడాదిన్నర క్రితం అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్‌లో వ్యూహాత్మకంగా హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా నెంబర్ టూ అయిన అబు యాహ్యా అల్ లిబి కూడా పాకిస్తాన్‌లో మృతి చెందినట్లుగా వార్తలు రావడం గమనార్హం.

English summary
Abu Yahya al-Libi, top strategist of al Qaeda, may have been killed in a drone strike in northwest Pakistan, as per Pakistani intelligence officials. If the report of Libi’s death is confirmed, it would be the biggest blow to al Qaeda since US special forces killed Osama bin Laden last May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X