• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో ట్రై వ్యాలీ: వీసా ఫ్రాడ్‌తో 8 మంది అరెస్టు

By Pratap
|

 An other Tri Vallry: 8 held in visa fraud case in US
వాషింగ్టన్: మరో ట్రై వ్యాలీ ఉదంతం అమెరికాలో వెలుగు చూసింది. అయితే కాస్తా ఊరట ఏమిటంటే, విద్యార్థులను అరెస్టు చేసి, వారికి రేడియో ట్యాగ్‌లు కట్టిన ఉదంతం చోటు చేసుకోలేదు. న్యూజెర్సీకి చెందిన అమెరికన్ హెల్త్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ (ఎహెచ్‌టిఐ) వీసా ఫ్రాడ్‌కు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం 8 మందిని అరెస్ట్ చేశారు. అమెరికా యూనివర్శిటీ ఫ్రాడ్‌కు 'విజన్ కెరీర్ కన్సల్టెంట్స్' (వీసీసీ) సంస్థ సహకరించింది.

నిరుడు ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం నిర్వాకం వల్ల అధికశాతం భారత విద్యార్థులు బాధితులుగా మారిన సంగతి తెలిసిందే. తాజా ఉదంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. అరెస్టయిన మోసగాళ్లలో రెండు సంస్థల అధ్యక్షులు మనమదురై సోమలింగం, ధీరేన్‌కుమార్ పరిఖ్‌తోపాటు వనరాజ్‌సింగ్ చావ్డా, మాలిక్ గజ్జర్, హేమలత క్రిస్టియన్, యాస్మిన్ రివెరా భారతీయులే కావడం విశేషం.

వారికి అమెరికన్లు మైకేల్ అల్ఫోన్సో, టిఫానీ థామస్ సహకరించారు. ఇతర వర్సిటీల్లో చదువు కొనసాగించడం లేదా స్వదేశం వెళ్లడంపై నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం విద్యార్థులకే వదిలేసింది. ఏహెచ్‌టీఐలోని 200 మంది విదేశీ విద్యార్థులలో ఎక్కువమంది భారతీయులే. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 15 ఏళ్ల కిందట ఈ సంస్థ ప్రారంభమైంది.

వలసకు వీల్లేని విద్యాభ్యాసానికి విదేశీయులను చేర్చుకునేలా అమెరికా ప్రభుత్వం కూడా అనుమతి ప్రసాదించింది. ప్రస్తుతం గుర్తింపు రద్దుకు నోటీసులు జారీచేసింది. తప్పుడు అటెండెన్స్ సర్టిఫికెట్లకు సహకరించడమే కాకుండా గతంలో ఇమిగ్రేషన్ లా ఉల్లంఘనల విషయాన్ని సంస్థ దాచి పెట్టింది. విసిసి శాఖలు బ్రిటన్,త ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా, న్యూజిలాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో దీని శాఖలన్నీ గుజరాత్‌లోనే ఉన్నాయి. అహ్మదాబాద్, ఆనంద్, బరోడా, గాంధీనగర్, నడియాడ్‌ల్లో ఆ శాఖలున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With eight officials of a New Jersey based educational institution arrested on charges of foreign student visa fraud, federal authorities have given the students, mostly from India, multiple options to continue their studies or return with prejudice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more