వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను కిరణ్ లింక్స్: నిర్మాతలపై సిఐడి కేసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో కలిసి వ్యవహారాలు నడిపిన ముగ్గురిపై సిఐడి కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. తెలుగు సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి. కళ్యాణ్‌లపై, ఆంజనేయులు గుప్తాపై సిఐడి కేసులు నమోదు చేసినట్లు ఆ వార్తాకథనాల సారాంశం. భాను కిరణ్‌తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వారిపై సిఐడి కేసులు నమోదు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి వారిపై కేసులు నమోదు చేసింది.

సి. కళ్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సిఐడికి ఫిర్యాదు చేశారు. నట్టి కుమార్ ఈ వ్యవహారంలో సిఐడి ముందు కూడా హాజరయ్యారు. వీరిరువురు పరస్పరం తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. భాను కిరణ్‌తో కలిసి సి. కళ్యాణ్, సింగనమల రమేష్ పలు దందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సూరి హత్యకు సింగనమల రమేష్ సమక్షంలోనే భాను కిరణ్ టెస్ట్ ఫైరింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

సూరి, రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు భాను కిరణ్ 2010 డిసెంబర్‌లో సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌లకు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్‌ నుంచి రక్తచరిత్ర - 2 రీళ్లను బెంగళూర్‌ తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. బెంగళూర్‌లోని ఫోరం మాల్‌లో, మేక్రీలోని మరో థియేటర్‌లో ప్రివ్యూ షో కోసం వాటిని భాను తీసుకుని వెళ్లినట్లు సిఐడి విచారణలో తేలిందని చెబుతున్నారు.

సి. కళ్యాణ్, సింగనమల రమేష్ సహకారంతో భాను కిరణ్ చిత్ర పరిశ్రమలో కూడా తన దందాను సాగించినట్లు అనుమానిస్తున్నారు. భాను కిరణ్ పట్టుబడిన తర్వాత పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, సినీ రంగంలో వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.

English summary
According to TV channel reports- CID has booked cases against film producers Singanamala Ramesh, C Kalyan and Anjaneyulu Gupta for alleged links with Bhanu Kiran, main accused in Maddelachervu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X