వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజా చిక్కుల్లో స్వామి నిత్యానంద: కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Swamy Nithyananda
బెంగళూర్: వివాదాస్పద స్వామి నిత్యానంద తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భౌతిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై వారి మీద ఎఫ్ఐఆర్‌లు నమోదైంది. స్థానిక టీవీ చానెల్ రిపోర్టర్, నవనిర్మాణ సేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదైంది. తమపై భౌతిక దాడులకు దిగారని, చంపుతామని బెదిరించారని వారు నిత్యానందపై, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు.

నిత్యానందపై, ఆయన అనుచరులపై బిదాడి పోలీసు స్టేషనులో నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు, గురువారం రాత్రి నిత్యానంద ఆశ్రమంలో తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారని రామనగర పోలీసు సూపరింటిండెంట్ అనుపమ్ అగర్వాల్ చెప్పారు. కొంత మంది మాజీ శిష్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిత్యానంద రేప్ అరోపణలతో పాటు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

నిత్యానంద, ఆయన అనుచరులు నలుగురు తనపై దాడి చేసారని, ఓ అమెరికా మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయంపై మీడియా సమావేశంలో నిత్యానందను ప్రశ్నించినందుకు తనపై ఆ దాడికి దిగారని రిపోర్టర్ ఆరోపించారు. నిత్యానందనే ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ రిపోర్టర్ తెలిపారు.

ఇదిలా వుంటే, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు కొంత మంది శుక్రవారం ఆశ్రమంలోకి దూసుకెళ్లి, నిత్యానంద పట్ల నిరసన వ్యక్తం చేశారు. వారికి, నిత్యానంద అనుచరులకు మధ్య మాటల యుద్ధం సాగింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

English summary
In fresh trouble for controversial godman Nithyananda, police have registered two FIRs against him and his followers for charges including physical assault. The FIRs were filed on complaints from a regional TV channel reporter and activists of Nava Nirmana Sene in connection with an altercation at Nithyananda's ashram here in Ramanagara District last night, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X