హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై వైయస్ నన్ను బెదిరించారు: యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్/వరంగల్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనను బెదిరించారనంటూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన శనివారం బత్తిన సోదరుల నుంచి చేప ప్రసాదం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా ఉద్యమాల్లో పాల్గొనకూడదని వైయస్ రాజశేఖర రెడ్డి హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు తనను పిలిపించి రాజకీయ జీవితం నాశనం చేస్తానని వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని ఆయన ఆరోపించారు. మంత్రులకు, నాయకులకు తాయిలాలు ఇచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్ ఎప్పుడూ సచివాలయానికి గానీ ప్రభుత్వ కార్యాలయాలకు గానీ రాని మాట వాస్తవమేనని, వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్, విజయమ్మ కలిసి ఫోన్లోనే రాయబారాలు సాగించారని ఆయన అన్నారు.

తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బద్ధశత్రువులని ఆయన అన్నారు. జగన్ సెటిల్మెంట్లన్నీ విజయమ్మకు తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. వైయస్ జగన్‌పై మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలుంటే వైయస్ జగన్ పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి శనివారం వరంగల్లు జిల్లాలో అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెసుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MP Madhu Yashki said that YS Rajasekhar Reddy has threatened him for participating in Telangana movement. He accused that YS Vijayamma knows the settlement done by his son and YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X