వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్‌ను ప్రతిపాదిస్తే పోటీ తప్పదు: తృణమూల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో కాంగ్రెసుపై తృణమూల్ కాంగ్రెసు విరుచుకుపడింది. రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేరును కాంగ్రెసు ప్రతిపాదిస్తే పోటీ తప్పదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి పదవికి తాము ఎవరి పేరును కూడా తిరస్కరించలేదని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి షాహిద్ సిద్దిఖి చెప్పారు.

రాజకీయంగా, నైతికంగా తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అంతకు ముందు మంత్రి అంబికా సోనీ విమర్శించారు. అంబికా సోనీ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెసు తీవ్రంగా మండిపడింది.

రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు పార్టీ మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్, సిపిఎం నేత సోమనాథ్ ఛటర్జీ పేర్లను తిరస్కరించింది. తృణమూల్ కాంగ్రెసు, సమాజ్‌వాదీ పార్టీలు మూడు పేర్లను సూచించాయి. రాష్ట్రపతి పదవికి తాము ప్రణబ్ ముఖర్జీని లేదా హమీద్ అన్సారీని అనుకుంటున్నామని సోనియా తనకు చెప్పారని, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు.

మమతా బెనర్జీ అంతర్గతంగా చర్చించిన విషయాలను బయటకు చెప్పడం ద్వారా మమతా బెనర్జీ రాజకీయ హుందాతనాన్ని విస్మరించారని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ సమాజ్‌వాదీ పార్టీతో సహా తన మిత్రపక్షాలతో మరోసారి చర్చించే అవకాశాలున్నాయి. కాగా, కాంగ్రెసు పాలిత ముఖ్యమంత్రులను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెసు అధిష్టానం ఆదేశించింది.

English summary
Hitting back at the Congress, Trinamool Congress said it had not gone out of decorum. Further, TMC said if Congress proposes Pranab's name, then there will be a contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X