హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నేత కాల్పులు, చంచల్‌గూడ వద్ద ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress Logo
హైదరాబాద్: ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఆ పార్టీ ఏడుచోట్ల గెలుపు సాధించింది. మరో ఎనిమది చోట్ల విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల్లో ఉత్సాహం పొంగిపొర్లింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆనందోత్సాహంలో ఉన్నారు.

హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. అయితే ఈ ఆనందోత్సాహంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ శాసనమండలి సభ్యుడు రెహ్మాన్ గన్‌తో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆనందం తట్టుకోలేక రెహ్మాన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో కార్యకర్తలు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఆ తర్వాత వారు తేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన రెహ్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా నర్సాపురంలో కాంగ్రెసు గెలుపొందగా, రామచంద్రాపురంలో గెలుపుదిశగా సాగుతున్నారు. మాచర్ల, ప్రత్తిపాడు, పోలవరం, రాయదుర్గం ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో రాయచోటిలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపొందింది. రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ, మాచర్ల, పోలవరం, అనంతపురం నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ డిపాజిట్ కోల్పోయింది.

కాగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంతో ఆ పార్టీ పూర్తి నిరుత్సాహంలో మునిగిపోయింది. కాంగ్రెసు పార్టీ రెండు చోట్ల విజయం సాధించనుండటంతో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మంచి ఉత్సాహంగా ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో టివి చూస్తున్నారు.

మరోవైపు చంచల్ గూడ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు ఘన విజయంతో భారీగా కార్యకర్తలు జైలు వైపు దూసుకు వచ్చారు. ముందుగానే జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు వైపు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
YSR Congress Party leader and former MLA Rehman fired five rounds into air in Hyderabad party office with happiness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X