వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు: వైయస్సార్సీపి 15, కాంగ్రెసు గెలుపు 2, టిడిపి 0

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెసు రెండు స్థానాల్లో విజయం సాధించింది. నర్సాపురం నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా విజయం సాధించారు. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. రెండో రౌండులో వెంకటరమణ 59 ఓట్ల మెజారిటీ సాధించారు. చివరికి విజయం భూమన కరుణాకర్ రెడ్డిని విజయం వరించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒంగోలులో మొదట ఆధిక్యంలో కొనసాగిన తెలుగుదేశం ఆ తర్వాత వెనకబడి పోయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. నర్సన్నపేటలో కాంగ్రెసు తిరిగి వెనకబడిపోయి వైయస్సార్సీపి అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ విజయం సాధించారు.

కాగా, పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలిచారు. చాలా చోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే పోరు కొనసాగింది. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి గెలిచారు. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించింది.

ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది.

ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.

English summary
YSR Congress is leading in 12 seats. Congress is leading at Narsapur and Tirupati, Counting of votes polling held for 18 assembly seats and Nellore Loksabha seat on June 12, has began today morning. Arrangements were made by EC for counting of votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X