హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హస్తినకు టి.కాంగ్రెస్: లగడపాటి విభజన వ్యాఖ్యలపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevan Reddy - Ponnam Prahabakhar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాష్ట్రం విడిపోతుందన్న ప్రచారం వల్లే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేర్వేరుగా మండిపడ్డారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వక పోవడం వల్లనే పరకాలలో కాంగ్రెసు డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిందని జీవన్ రెడ్డి అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెసుకు ఆదరణ ఉండదని జీవన్ చెప్పారు. తెలంగణపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే అన్ని పార్టీల వైఖరి తెలుస్తుందన్నారు. తెలంగాణ మంత్రులు కేబినెట్ నుండి తప్పుకుంటే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా ఉండాలని సూచించారు.

పరకాలలో ప్రజాతీర్పుపై మాట్లాడే నైతిక హక్కు లగడపాటి రాజగోపాల్‌కు లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అంశంపై లగడపాటి ఏ హోదాలో మాట్లాడతారని ప్రశ్నించారు. తెలంగాణ అంశంపై లగడపాటి మాట్లాడకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కట్టడి చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రంపై అధిష్టానంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు.

జూన్ నెలఖరులో తాము ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. జోక్యం చేసుకోవద్దని చెప్పినా లగడపాటి సిగ్గులేకుండా తెలంగాణ విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్నారు. ఇరు ప్రాంతాలలో కాంగ్రెసును కాపాడుకోవాలన్న తమ ఆకాంక్షకు ఆయన అడ్డు పడుతున్నారన్నారు. లగడపాటి తెలంగాణ గురించి మాట్లాడటం పక్కన పెట్టి సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవాలని సూచించారు. 14ఎఫ్ తొలగిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి ఏం చేశారన్నారు.

కాగా తెలంగాణ కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నెలాఖరున ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణ అంశంపై పార్టీ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేయనున్నారు. తెలంగాణ ఇవ్వకపోయినా సీమాంధ్రలో కాంగ్రెసు ఘోర పరాజయం పాలు కావడాన్ని వారు అధిష్టానం దృష్టికి తేనున్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో క్రమంగా కాంగ్రెసు పుంజుకుంటుందని, రాష్ట్రం ఇవ్వగానే తెలంగాణలో బలపడుతుందని వారు అధిష్టానానికి సూచించే అవకాశముంది.

English summary
Telangana Congress leaders are planning to go New Delhi in this month for pressuring Telangana state on party high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X