తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదీ మా సొంత ఊరే: ప్రతాప్ సి.రెడ్డి గ్రామంలో చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చిత్తూరు: ఇక నుండి అరగొండ కూడా తమ సొంత ఊరేనని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం అన్నారు. నూతన దంపతులు రామ్ చరణ్ తేజ, ఉపాసనలతో కలిసి చిరంజీవి కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం వారు జిల్లాలోని తవణంపల్లె మండలంలో ఉన్న అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి సొంత ఊరు అరగొండకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో రాత్రి అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిరంజీవి, నూతన దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.

అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి వెంటి గొప్ప వ్యక్తి జన్మించిన అరగొండకు రావడం తమ అదృష్టమని అన్నారు. అరగొండతో బంధుత్వం కలవడంతో మనం ఆత్మబంధువులం అయ్యామని అభిమానులను ఉద్దేశించి అన్నారు. తన ఇష్టమైవమైన శ్రీ ఆంజనేయస్వామి కొలువైన అర్ధగిరికి నూతన దంపతులను తీసుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు నూతన దంపతులతో పాటు అందరికీ ఉండాలన్నారు.

ఉపాసన వంటి ఉత్తమురాలు తమ ఇంటి కోడలు కావడం తమ అదృష్టమన్నారు. ఆమెను తమ కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు చిరంజీవి, రామ్ చరణ్ తేజ దంపతులు అరగొండలోని ప్రతాప్ సి.రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం గ్రామంలో అపోలో గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి ప్లాంటును ప్రారంభించారు.

అర్ధగిరిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అన్నదానం కోసం చరణ్ దంపతులు, ప్రతాప్ సి.రెడ్డి దంపతులు, ఆయన కుమార్తే ప్రీత మొత్తం రూ.ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. కాగా గురువారం రామ్ చరణ్ తేజ, ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

English summary

 Rajyasabha Member Chiranjeevi said Aragonda of Chittoor district is our own village from now onwards. Chiranjeevi tour in Apollo grop chairman Pratap C.Reddy's home village Aragonda on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X