హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: శ్రీనివాసన్‌ను ప్రశ్నించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivasan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ బిసిసిఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్‌కు సిబిఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆయన సోమవారం సిబిఐ ముందుకు వచ్చారు. సిబిఐ అధికారులు ఆయనను సోమవారం ఆరు గంటల పాటు విచారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులో ప్రయోజనం చేకూర్చారని, అందుకు ప్రతిగా ఇండియా సిమెంట్స్ వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సిబిఐ భావిస్తోంది.

వైయస్ జగన్‌కు చెందిన సాక్షి, కార్మైల్, భారతి సంస్థల్లో పెట్టుబడులపై సిబిఐ అధికారులు శ్రీనివాసన్‌‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ఇండియా సిమెంట్స్ ప్లాంట్లకు నిబంధనలకు విరుద్ధంగా నీటి కేటాయింపు జరిగిందని, వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగానే ఇండియా సిమెంట్స్ నీటి కేటాయింపును పొందిందని అంటున్నారు. ఇండియా సిమెంట్స్‌కు ప్రభుత్వం కడప, కర్నూలు, అనంతపురం, రంగా రెడ్డి జిల్లాల్లో సున్నపురాయి నిక్షేపాలను కూడా కేటాయించింది.

ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులపై సిబిఐ అధికారులు ఇది వరకే వైయస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యను, ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌లను ప్రశ్నించారు. వీరిచ్చిన సమాచారం మేరకు సిబిఐ అధికారులు సోమవారం శ్రీనివాసన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.

ఇండియా సిమెంట్స్‌తో పాటు పెన్నా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్లకు కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఇతర రెండు సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపుపై ప్రశ్నించేందుకు సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాద రావు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.

బిసిసిఐ చైర్మన్ అయిన శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపియల్ జట్టు యజమాని కూడా. ఆయన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఉత్పత్తిని రెండింతలు చేయడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద యెత్తున నదీజలాలను ఇండియా సిమెంట్స్ పొందినట్లు భావిస్తున్నారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ప్లాంట్లకు అదనపు నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది.

English summary
CBI is grilling BCCI chairman and India cements managing director Srinivasan in YSR Congress president YS Jagan DA case today. It is alleged that India cements has got additional allocation of river waters floating rules and regulations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X