వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలగించండి: పాక్ ప్రధాని గిలానిపై సుప్రీం అనర్హత వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రధానమంత్రి యూసఫ్ రాజా గిలానీపై వేటు వేసింది. ప్రధానమంత్రి గిలానీని మంగళవారం కోర్టు అనర్హుడిగా ప్రకటించింది. కోర్టు ధిక్కారణ కేసులో దోషి అయిన ప్రధాని గిలాని ప్రధాని పదవికి అనర్హుడు అని తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగపరమైన పాత్ర నిర్వహించాలని పాక్ అధ్యక్షుడికి సూచించింది. అవి పాటించననందున అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు చెప్పింది.

పాక్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీ అవినీతి ఆరోపణలకు సంబంధించి గిలానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు గిలానీపై కోర్టు ధిక్కారణ కేసును నమోదు చేసింది. ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది.

గిలానీ స్థానంలో వెంటనే నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పును పాకిస్తాన్ పీపుల్సా పార్టీ స్వాగతించింది. ఇవాళ రాత్రి లోగా కొత్త నేతను ఎన్నుకుంటామని ప్రకటించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఇఫ్తికర్ మహమ్మద్ చౌదరి.. గిలానీని పార్లమెంటు మెంబర్‌కు అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

ఆయన ఈ రోజు నుండి ప్రధాని పదవికి కూడా అనర్హుడు అని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో గిలానీ ఏ సమయంలోనైనా రాజీనామా చేసే అవకాశముంది. కాగా ప్రధానమంత్రి తరఫు లాయర్ ఫావద్ చౌదరి.. కేవలం పార్లమెంటుకు మాత్రమే ప్రధానిని తొలగించే అవకాశముందని చెప్పారు.

English summary
Pakistan's Supreme Court today disqualified Prime Minister Yousuf Raza Gilani from office. Earlier the court had convicted him for contempt on April 26 because he refused to ask Swiss authorities to reopen some corruption cases against President Asif Ali Zardari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X