హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను కల్సిన పిజెఆర్ తనయ: మంత్రి కొడుకు పరుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దివంగత ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్ధన్ రెడ్డి(పిజెఆర్) తనయ విజయా రెడ్డి బుధవారం కలిశారు. మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణ కూడా జగన్‌ను జైలులో ములాఖత్ సమయంలో కలిశారు. విజయా రెడ్డి, విశ్వరూప్ తనయుడు జగన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జగన్‌ను కలిసేందుకు వచ్చిన విశ్వరూప్ తనయుడు మీడియాను చూసి పరుగు లంఘించుకున్నారని టివి చానెల్‌లో ప్రసారమయింది. ఆయన మీడియా నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశాయని చెబుతున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన కృష్ణ తాను మాజీ మంత్రి మోపిదేవిని కలిసేందుకు వచ్చానని, జగన్‌ను కలిసేందుకు రాలేదని చెప్పారు. మరోవైపు విజయా రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి పిజెఆర్ మరణం తర్వాత దివంగత వైయస్ తమను బాగా ప్రోత్సహించే వారన్నారు. తనను రాజకీయాలలోకి రమ్మంటే సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పానని తెలిపారు.

జగన్ సతీమణి భారతి రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. జైలులో జగన్ చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎలాంటి అసహనం ప్రదర్శించడం లేదని చెప్పారు. జగన్ త్వరలో జైలు నుండి బయటకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.

జగన్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కుట్రలో భాగంగానే ఆయన జైలుకు వెళ్లారని అందరూ గట్టిగా నమ్ముతున్నారన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తారని తాను, జగన్, ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

జగన్‌ను కలిసిన వారిలో ఆయన భార్య భారతి రెడ్డి, విశ్వరూప్ తనయుడు, మాజీ డిజిపి స్వరణ్‌జిత్ సేన్ సతీమణి, అంబటి రాంబాబు, విజయా రెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి తదితరులు ఉన్నారు.

English summary
P Janardhan Reddy(PJR) daughter Vijaya Reddy and Minister Vishwarup son met YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy in Chanchalguda jail on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X