వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ ప్రధానిగా రాజా గిలానీ స్థానంలో షహబుద్దీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani-Asif Ali Zardari
ఇస్లామాబాద్: యూసఫ్ రాజా గిలానీ స్థానంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పార్టీ సీనియర్ నేత షహబూద్దీన్‌ను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూర్చుండబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఎన్నిక జరగనుంది. ఆయన ఎంపిక లాంఛనమే అవుతుంది. పిపిపితో పాటు భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా షహబుద్దీన్‌కు ఉంది. దీంతో ప్రధాన మంత్రి పీఠాన్ని షహబుద్దీన్ అధిష్ఠించనున్నారు. సీనియర్ నేత, టెక్స్‌టైల్ మంత్రి షహబుద్దీన్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తూ అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి) బుధవారం నిర్ణయం తీసుకుంది.

యూసుఫ్ రజా గిలానీపై పాకిస్థాన్ సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసిన దరిమిలా పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయమే అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, పిపిపి సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రధాని ఎన్నిక కోసం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జాతీయ అసెంబ్లీ సమావేశమవుతుందని పిపిపి నేత ఖుర్షీద్ షా వెల్లడించారు. కొత్త ప్రధాని ఎంపికలో పూర్తి సహకారం అందిస్తామంటూ జర్దారీకి సంకీర్ణ కూటమి భాగస్వామ్యపక్షాలు హామీ ఇచ్చాయి.

కాగా, షహబుద్దీన్ అభ్యర్థిత్వంపై సంకీర్ణ కూటమి నేతల భేటీలో గిలానీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 26 నుంచే గిలానీని అనర్హుడిగా పరిగణిస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొన్నందున.. గిలానీ మంత్రివర్గం కూడా ఆనాటి నుంచే విధులకు దూరంగా ఉన్నట్టు సర్కారు గజిట్‌లో పేర్కొన్నారు. మరి గత రెండు నెలల్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రద్దవుతాయా? లేదా? అనే మీమాంస వ్యక్తమవుతోంది.

కాగా పిపిపి అధినేత బాధ్యతల నుంచి తప్పుకోకుండా అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. 2011 మే నాటి లాహోర్ ఫుల్‌కోర్టు బెంచ్ ఉత్తర్వుల్లో ఆశించినట్టుగా పిపిపి కో చైర్మన్ పదవి నుంచి జర్దారీ వైదొలగకపోవడం కోర్టును ధిక్కరించినట్టేనంటూ న్యాయవాది అజార్ సిద్దిఖీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

English summary
The ruling Pakistan People's Party (PPP) reportedly nominated senior leader Makhdoom Shahabuddin for the post of premier on Wednesday, following the Supreme Court's disqualification of Prime Minister Yousuf Raza Gilani. The decision was made at a meeting of senior PPP leaders chaired early on Wednesday morning by President Asif Ali Zardari, Geo News channel quoted its sources as saying. The meeting further decided to convene a session of the National Assembly or lower house of parliament on Thursday to formally elect the new leader of the House, the report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X