హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో కొడుకు భేటీ: మంత్రి సీరియస్, చిరు వల్లే.. తోట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Thota Trimurthulu - Vishwaroop
హైదరాబాద్: తన తనయుడు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై మంత్రి విశ్వరూప్ సీరియస్‌గా స్పందించారు. తన తనయుడు జగన్‌ను కలవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా తాను కంట్రోల్ చేస్తానని చెప్పారు. తమ దగ్గర జగన్ పార్టీలోకి ఎలాంటి వలసలు ఉండవని స్పష్టం చేశారు.

తన తనయుడు జగన్ కలవడాన్ని ఖండిస్తూనే ఒకే ఇంట్లో వేరు వేరు అభిప్రాయాలు ఉండవచ్చునని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నదమ్ములే ఒకరిపై మరొకరు పోటీకి దిగారని గుర్తు చేశారు. తన తనయుడికి కేవలం ఇరవై అయిదేళ్లేనని, ఆవేశంలో ఏదో కలిసి ఉంటాడని, అలా కలవకుండా చూస్తానని చెప్పారు. రామచంద్రాపురంలో గెలుపును తాము రెఫరెండంగా భావిస్తామని అప్పుడే చెప్పామని అన్నారు.

2014లో తాను కాంగ్రెసు పార్టీ తరఫునే అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని విశ్వరూప్ చెప్పారు. పార్టీ చెప్పినట్లు నడుచుకుంటానని తెలిపారు. రామచంద్రాపురంను రెఫరెండంగా భావించి పార్టీలో అందరం కలిసి కట్టుగా ఉండి తోట త్రిమూర్తులును గెలిపించుకున్నామని చెప్పారు. రామచంద్రాపురం నుండి గెలిచిన తోట త్రిమూర్తులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

ఐక్యమత్యంగా అందరూ పని చేయడం వల్లే గెలిచానని చెప్పారు. తన నియోజకవర్గంలో పిఆర్పి, కాంగ్రెసు శ్రేణులు కలిసి కట్టుగా పని చేశాయని చెప్పారు. తాను మంత్రి పదవిని ఆశించడం లేదని, తన జిల్లా నుండి తోట నరసింహం మంత్రిగా ఉన్నారని, తాను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చి టిడిపి జగన్ పార్టీకి సహకరించిందని ఆరోపించారు.

వైయస్ జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని హెచ్చరిస్తే రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నిలబెడతానని సవాల్ చేశారన్నారు. చిరంజీవి మాట నిలబెట్టేందుకే తాను పోటీలో నిలబడ్డానని చెప్పారు. చిరంజీవి ఆశీస్సులతోనే తాను గెలిచానని తెలిపారు. చిరు మాట నిలబెట్టేందుకు పోటీకి దిగి గెలుపొందటం ఆనందంగా ఉందని చెప్పారు.

English summary
Minister Vishwaroop condemned his sons meet with YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy in chanchalguda jail. Ramachandrapuram MLA Thota Trimurthulu said he was won by Rajyasabha Member Chiranjeevi blessings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X