వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూరి రథయాత్ర తొక్కిసలాటలో విశాఖ మహిళ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Puri Jagannath Ratha Yatra
భువనేశ్వర్: పూరి రథయాత్ర విషాద సంఘటనతో ప్రారంభమైంది. పూరి రథయాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మరణించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మహిళ ఉంది. పూరి రథయాత్ర గురువారం ప్రారంభం కావడానికి కొద్ది ముందు తొక్కిసలాట చోటు చేసుకుంది. రథంపై ఉన్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూర్తులను చూడడానికి భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.

మరణించిన ఇద్దరు భక్తుల్లో ఒకర్ని విశాఖపట్నానికి చెందిన రవణమ్మ (30)గా గుర్తించారు. మరో వ్యక్తి పురుషుడు. అతను ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. రథయాత్ర గుంపులో ఆ మహిళ ఉందా, లేదా అనేది తెలియాల్సి ఉందని పూరి జిల్లా కలెక్టర్ అర్వింద్ అగర్వాల్ అన్నారు. అసలు తొక్కిసలాట జరిగిందా, లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

వాతావరణం చల్లగానే ఉన్నప్పటికీ పలువురు యాత్రికులు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. తల తిప్పుతోందనే కారణంతో చాలా మంది ఆస్పత్రిలో చేరారు. చికిత్స చేసి వారిని డిశ్చార్జి చేశారు. తొమ్మిది రోజుల మహోత్సవంలో పోలీసులు యాత్రికులను నియంత్రించడంలో విఫలమయ్యారనే విషయాన్ని ఇద్దరు భక్తుల మృతి అద్దం పడుతోందని అంటున్నారు.

గుంపులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో 2008, 2010, 2011ల్లో కూడా తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.

English summary
The Ratha Yatra began on a tragic note following the death of two devotees, including of a woman from Visakhapatnam, in a stampede on Puri's Grand Road just hours before the the chariots were to start rolling, on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X