వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను కిరణ్ లింక్స్: డిజిపిని కలిసిన అల్లు అరవింద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: టాలీవుడ్‌లో మద్దెలచెర్వు సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ సంబంధాలపై తెలుగు సినీ నిర్మాతలు కొందరు సిఐడి అధికారులను కలిశారు. శుక్రవారం సిఐడి అధికారులను కలిసిన నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవారిని పరిశ్రమకు చెందిన కొంత మంది బెదిరిస్తున్నారని వారు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. భాను కిరణ్ వ్యవహారంతో మాఫియాకు, నిర్మాతలకు మధ్య సంబంధాలు బయటపడడంతో కొంత మంది దాన్ని వాడుకుని బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కొద్ది ప్రముఖ నిర్మాతలపై, ఫైనాన్షియర్లపై కేసులు నమోదు చేశారు. అల్లు అరవింద్‌తో పాటు నిర్మాతలు కె. అశోక్ కుమార్, ఎంఎల్ కుమార్ చౌదరి డిజిపి వి. దినేష్ రెడ్డిని, సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్వీ రమణమూర్తిని కలిశారు. ఫిల్స్ చేంబర్స్ తరఫున వారు పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను వివరించారు.

కేసులు నమోదు చేయడానికి ముందు చిత్ర పరిశ్రమ ప్రముఖులపై వచ్చిన ఫిర్యాదుల మంచీచెడులను పరిశీలించాలని వారు కోరారు. నట్టి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్, ఆంజనేయ గుప్తాలపై కేసులు నమోదు చేశారు. నట్టి కుమార్ మరింత మందిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతుననారు.

పంపిణీదారులకు, నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య వివాదాలు అతి సాధారణమని నిర్మాతలు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే కేసులు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివరించిన విషయాలపై నిర్మాతలు పెదవి విప్పడం లేదు.

English summary
Perturbed over the investigation taken up by the city police into the alleged links of gangster Bhanu Kiran with Tollywood, few prominent producers including Allu Aravind met officials of the Crime Investigation Department (CID) on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X