హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: మళ్లీ శ్రీనివాసన్‌ను విచారించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

N Srinivasan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో బిసిసిఐ చీఫ్, ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ రెండో సారి సిబిఐ ముందు హాజరయ్యారు. ఆయన శనివారం మరోసారి సిబిఐ ముందుకు వచ్చారు. ఇంతకు ఓసారి శ్రీనివాసన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వైయస్ జగన్ కేసులో శ్రీనివాసన్‌ను సిబిఐ అధికారులు శనివారంనాడు 8 గంటల పాటు విచారించారు.

సోమవారంనాడు శ్రీనివాసన్‌ను సిబిఐ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇండియా సిమెంట్స్ వైయస్ జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై సిబిఐ అధికారులు శ్రీనివాసన్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియా సిమెంట్స్‌కు చెందిన నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ప్లాంట్లు కృష్ణా, కాగ్నా నదుల నుంచి భారీ నీటి కేటాయింపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి రెండు జీవోలు జారీ అయ్యాయి. అందుకు ప్రతిఫలంగానే ఇండియా సిమెంట్స్ వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇతర సంస్థల్లో 135 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ అనుమానిస్తోంది.

వైయస్ జగన్‌ను సిబిఐ మే 27వ తేదీన అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు కోర్టులో మూడు చార్జిషీట్లను దాఖలు చేసింది. జగన్‌తో కలిసి ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుట్ర చేసి కొన్ని సంస్థలకు మేలు చేకూర్చారని, ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులను తెచ్చుకున్నారని సిబిఐ ఆరోపిస్తోంది.

English summary
BCCI chief and India Cements Managing Director N Srinivasan today appeared before the CBI here for the second time this week for questioning in connection with a disproportionate assets case filed against YSR Congress chief Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X