హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంటెయినర్ ఢీ: పల్టీ కొట్టి నుజ్జునుజ్జయిన ఆర్టీసి బస్సు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్/నిజాబామాద్: కోఠి వెళుతున్న ఓ ఆర్టీసి బస్సును వేగంగా వచ్చిన కంటెయినర్ ఢీకొనడంతో ఆ బస్సు నుజ్జు నుజ్జు అయిన సంఘటన హైదరాబాదులో ఆదివారం జరిగింది. బర్కత్‌పురా డిపోకు చెందిన ఓ బస్సు హైటెక్ సిటీ ప్రాంతంలో కోఠి వైపు వస్తోంది. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద వేగంగా వచ్చిన ఓ కంటెయినర్ బస్సును ఢీకొంది. దీంతో బస్సు పల్టీ కొట్టింది. అందులో ప్రయాణీకులు ఎక్కువ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కంటెయినర్ ఢీకొన్న సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు నలుగురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అదివారం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. రోజూ ఈ బస్సులో చాలామంది సాఫ్టువేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. దీంతో బస్సు పూర్తిగా నిండిపోతుంది.

అయితే ఈరోజు ఆదివారం కావడంతో సాఫ్టవేర్ ఉద్యోగులకు సెలవుదినం. ఆ రోడ్డులో కూడా రోజు చాలామంది ప్రయాణిస్తుంటారు. ఈరోజు రోడ్డు పైన ఎక్కువమంది లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. మరోవైపు కర్మన్‌ఘాట్‌లో శ్రీకాంత్ అనే పన్నెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన దుండగులను స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఇంటిముందు ఆడుకుంటున్న శ్రీకాంత్ అనే బాలుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మభ్యపెట్టి ఓ గదిలో బంధించారు.

వారి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో వారి కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. స్థానికులకు విషయం తెలిసిపోవడంతో వారిలో ఒకరు పారిపోయాడు. మిగిలిన ఇద్దరిని చావబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మూడో వ్యక్తి కోసం పట్టుబడ్డ ఇద్దరి నుండి సమాచారం కూపీ లాగుతున్నారు.

కాగా నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ధర్మోరలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చెరువులో పడవేశాడు. కుటుంబ కలహాల కారణంగానే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

English summary

 Clash took between RTC bus and container at Gachibowli of Hyderabad on Sunday. Two were injured in this accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X