చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త వివాదంలో నిత్యానంద స్వామి: రంజిత పైనా కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nithyananda and Ranjitha
చెన్నై/బెంగళూరు: వివాదాస్పద నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. మధురై నగర పోలీసులు నిత్యానందపై జంతు సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. నిత్యానంద మఠంలో పోలీసులు పది పులి చర్మాలు, మరో పది ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిత్యానంద పులి చర్మంపై కూర్చొని దీక్ష చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పది పులి చర్మాలు, పది ఏనుగు దంతాలు ఆశ్రమంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

నిత్యానంద పులి చర్మం ఉపయోగిస్తున్నట్లు హిందూ మక్కల్ కచ్చి సభ్యుడు సోలై కణ్ణల్ ఫిర్యాదుతో బయటకు వచ్చింది. పోలీసులు నిత్యానందతో పాటు రాసలీలల కేసులో ఇరుక్కున్న నటి రంజిత పైన, పిఆర్‌ఓ పైన కూడా కేసు నమోదు చేశారు. నిత్యానంద తనకు డ్రింక్ ఇచ్చి ఇంగ్లీష్ పాటకు డాన్స్ చేయమన్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. దీనిపై ఆధారాలు లేనందున కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే నిత్యానందను పలు వివాదాలు చుట్టు ముట్టిన విషయం తెలిసిందే.

తమిళనాడులోని మదురై ఆధీనంలోని మతపరమైన కేంద్రంలోని పవిత్ర జలాల్లో నిత్యానంద డ్రగ్స్ కలిపేవాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హిందూ మక్కల్ కచ్చికి చెందిన ఎం సోలైకణ్ణన్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తులకు నిత్యానంద ఇస్తున్న పవిత్ర జలాలను పరీక్షలకు పంపించాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, సోలైకణ్నన్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో నిత్యానందపై, మరో ఇద్దరిపై సోలైకణ్నన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం కోర్టులో విచారణ ప్రారంభమైంది.

నిత్యానందపై, ఆయన ఇద్దరు శిష్యులపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. నిత్యానంద ఇటీవల కర్ణాటకలోని బెంగళూర్ నుంచి తమిళనాడులోని మదురైకి మారాడు. ఆయనను ఎప్పటికప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఓ నటితో రాసలీలలు నడిపినట్లు ఆరోపిస్తూ బయటకు వచ్చిన వీడియోల కేసులో ఆయన 2010లో మొదటి సారి అరెస్టయ్యాడు.

ఆ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత 2012లో జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే అభియోగాలను ఆయన ఎదుర్కున్నారు. రేప్, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు కూడా అతన్ని చుట్టుముట్టాయి. విదేశీ వనితను లైంగిక వేధించిన కేసులో నిత్యానందను అరెస్టు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆదేశాలు జారీ చేశారు.

English summary

 Controversial self-proclaimed godman Swami Nithyananda's troubles don't seem to end even with his appointment as Junior Pontiff of the 1500-year-old Saivaite Mutt, Madurai Adheenam. The Madurai city police have registered a case against him under the Wildlife Protection Act 1972 for alleged possession of ten tiger skins and an equal number of elephant tusks in the Madurai mutt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X