వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

86 గంటల ప్రయాస: బోరుబావిలో పడిన చిన్నారి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahi
గుర్గాన్: బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మహిని రెస్క్యూ టీం ఆదివారం బయటకు తీసింది. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 86 గంటల తర్వాత రెస్క్యూ టీం చిన్నారిని బయటకు తీసింది. బుధవారం రాత్రి మహి బోరు బావిలో పడిపోయింది. అయితే బోరు బావి నుండి బయటకు తీసిన తర్వాత ఆమెకు ఆరోగ్య పరీక్షలు జరిపేందుకు అధికారులు వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు మహి మృతి చెందినట్లు చెప్పారు. గూర్గావ్ జిల్లా కలెక్టర్ కూడా ప్రకటన చేశారు. రక్షక సిబ్బంది ఎంతో కష్టపడి మహిని బయటకు తీశారు.

కాగా మహి బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో బోరు బావిలో పడింది. పుట్టిన రోజు సందర్భంగా అడుకుంటానని వెళ్లిన ఆమె కొంతదూరంలో ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆర్మీయే రంగంలోకి దిగింది. తొలుత ప్రతి ప్రయత్నానికి ఏదో ఒకటి అడ్డు తగిలినప్పటికీ మహిని మాత్రం బయటకు తీశారు. మహి దాదాపు 70 అడుగుల లోతులోని బోరు బావిలో ఇరుక్కు పోయింది.

చిన్నారిని ప్రాణాలతో ఉంచేందుకు బావిలోకి ఆక్సిజన్ పంపించారు. మహిని కాపాడేందుకు ఆర్మీ ఇంజనీర్లు, జాతీయ భద్రతా దళం కమెండోలు, పోలీసులు, గుర్గావ్ మెట్రో రైలు ఇంజనీర్లు ఇలా మొత్తం వందమందికి పైగా రంగంలోకి దిగారు. ఆ బోరు బావికి ఎనిమిది అడుగుల దూరంలో మరో బోరు బావిని తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ రెండింటి మధ్య సొరంగం తవ్వుతుండగా పెద్ద రాయి అడ్డు వచ్చింది.

దాంతో శనివారం మరో సొరంగం తవ్వారు. మళ్లీ రాయి వచ్చినా.. దానిని డ్రిల్లింగ్ మెషీన్లతో పగలగొట్టేందుకు ప్రయత్నించి చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కు చెందిన ప్రత్యేక నిపుణులతో మరో బోరు బావి తవ్వారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని మానేసర్ పట్టణం సమీపాన కషాన్ గ్రామంలో జరిగింది. చిన్నారిని రక్షించేందుకు సైన్యం, అగ్నిమాపక, పోలీసు, ఆరోగ్య, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మహిని తీసినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

English summary
The four-year-old girl Mahi, who was trapped inside a narrow, 70-feet borewell for 86 hours since Wednesday, was finally lifted out by the rescuers. The intense operation, which included army men, police personnel and others, continued for nearly four days and was hampered time and again by factors like rock obstacles and lack of oxygen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X