విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ధర్నాకు దూరంగా జూ. మిత్రుడు నాని, చిన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinnam Ramakotaiah-Kodali Nani
విజయవాడ: కృష్ణా జిల్లాలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం చేపట్టిన మహాధర్నాలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు మహాధర్నా నిర్వహించారు. ఈ సభకు భారీగా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కానీ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య మాత్రం హాజరు కాలేదు.

ఇటీవల వారు పార్టీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. నాని, రామకోటయ్య జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే వారు అధినేత పాల్గొన్న మహాధర్నాలో పాల్గొనకపోవడం చర్చకు తావిస్తోంది. కొడాలి నాని ఉప ఎన్నికలకు ముందు జగన్ పార్టీ వైపు వెళతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన మంత్రి పార్థసారథితో భేటీ కావడంతో ఆ పార్టీ వైపు చూస్తున్నారనే వాదనలు వినిపించాయి.

తాజాగా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడలో పలు చోట్ల వైయస్ జగన్‌తో పాటు ఉన్న నాని ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అయితే వాటిపై నాని ఇటీవల బాబును కలిసి వివరణ ఇచ్చారు. తాను జగన్ పార్టీలోకి వెళ్లడం లేదని, టిడిపిలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. వివరణ ఇచ్చిన నాలుగు రోజులకే బాబు ధర్నాలో ఆయన పాల్గొనక పోవడం గమనార్హం.

మరోవైపు చిన్నం రామకోటయ్య... ఏకంగా తాను వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఈ పార్టీ నుండి పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను అప్పటి పరిస్థితులను అనుసరించి ప్రజలకు సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుందని భావించే పార్టీలోకి వెళతానని చెప్పారు. అయితే ఆయన జగన్ వైపు వెళ్లేందుకే మానసికంగా సిద్ధమయ్యారని, కానీ అప్పుడే ఆ వైపు వెళుతున్నట్లు మాత్రం సంకేతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.

English summary
Gudiwada MLA Kodali Nani and Nuziveedu MLA Chinnam Ramakotaiah did not attended to party chief Nara Chandrababu Naidu's mahadharna, which is occurred at Kummaripalem of Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X