వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై దాడుల కేసు: ఉగ్రవాది జబీయుద్దీన్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Attacks
న్యూఢిల్లీ: ముంబై దాడుల కేసులో కీలక పాత్రధారి అయిన సయ్యద్ జబీయుద్దీన్ అలియాస్ అబు హంజా అలియాస్ జబీ అన్సారీ అలియాస్ అబు జిందాల్ అలియాస్ రియాసత్ అలీని ఎట్టకేలకు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. మూడేళ్ల వేట ఫలితంగా అతను భారత భద్రతా బలగాలకు చిక్కాడు. ముంబైలో 2008లో దాడులు జరిపిన పది మంది ఉగ్రవాదులకు అతను హిందీ భాష నేర్పినట్లు ఆరోపిస్తున్నారు. అతను లక్షరే తోయిబా ఉగ్రవాది అని అనుమానిస్తున్నారు. జబీయుద్దీన్ అరెస్టును కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ధ్రువీకరించారు.

గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన 30 ఏళ్ల అన్సారీ అలియాస్ అబూ జిందాల్‌ ఈ నెల 21వ తేదీన అరెస్టు చేశారు. ఇతను మహారాష్ట్రలోని బీడ్ జిల్లా గెయోరీ ప్రాంతానికి చెందినవాడు. ఇతన్ని అరెస్టు చేసిన విషయాన్ని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. అతని కోసం భారత్ ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.

అతని అరెస్టు సందర్భంగా పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, వారిని దాడులకు పురికొల్పిన పాకిస్తాన్ వ్యక్తులకు మధ్య జరిగిన సంభాషణల్లో విచిత్రమైన గొంతకు సంబంధించిన సమాచారం బయటపడింది. 26/11 దాడుల సందర్భంగా హంజా పాకిస్తాన్‌లో ఉన్నట్లు సమాచారం. హంజా దాడులకు లక్ష్యాలను గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో గుజరాత్‌కు సంబంధించిన కేసుల్లో కూడా అతని అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడ్ని కోర్టు 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. అతని అరెస్టుతో పది మంది ఉగ్రవాదలతో సంభాషణలు జరిపిన అదృశ్య వ్యక్తి సంభాషణల గుట్టు బయటపడింది. టేప్‌లో ప్రహసన్ (ప్రభుత్వం) వంటి ప్రత్యేకమైన పదజాలాన్ని వాడాడు. ఉగ్రవాదులు తమ గుర్తింపును చెప్పకూడదని, తాము హైదరాబాదులోని టోలీచౌక్‌కు చెందిన దక్కన్ ముజాహిదీన్‌గా చెప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

English summary
In a major breakthrough, the Special Cell of the Delhi Police has arrested a key terror suspect involved in the 26/11 Mumbai terror attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X