వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Virbhadra Sing
సిమ్లా: కేంద్రమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కుట్ర, అవినీతి సంబంధించిన కేసులు నమోదు చేయాలని సిమ్లాలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. 23 ఏళ్ల క్రిందట జరిగిన ఈ వ్యవహారంలో మంత్రి, ఆయన భార్య ప్రతిభాసింగ్‌ల నేరాలకు కచ్ఛితమైన సాక్ష్యాధారాలు లభించిన నేపథ్యంలో ఐపిసి సెక్షన్ 120 బి(కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని 7,11,13 సెక్షన్‌ల ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి బిఎల్ సోని కేసు నమోదుకు ఆదేశించారు.

కాగా, ప్రస్తుతం లఘు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వీరభద్ర సింగ్ 1989లో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కొందరు పారిశ్రామికవేత్తలతోపాటు ఐఎఎస్ అధికారి మహిందర్ లాల్‌తో లంచం, ఇతర అవినీతి పరమైన లావాదేవీలపై సింగ్ జరిపిన సంభాషణలు రికార్డైయ్యాయి.

ఆ ఆడియో సీడి ఆధారంగా ఈ కేసు నడుస్తుండగా, ఈ సీడిని మాజీ కాంగ్రెస్ మంత్రి విజయ్ సింగ్ మన్కోటియా 2007 మేలో విడుదల చేశారు. దీని ఆధారంగానే వీరభద్ర సింగ్, ఆయన భార్యపై తాజా కేసుల నమోదుకు కోర్టు ఆదేశించింది. ఇదిలావుంటే కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీడిలో ఉన్నదంతా బూటకమని, అందులో వినిపించేది తన గొంతు కాదని వీరభద్ర సింగ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరభద్ర సింగ్, ఆయన భార్య 1989లో అంబుజ సిమెంట్స్ నుంచి 3 లక్షల రూపాయలు, మీకెన్ బ్రేవరీ నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆరోపణ. సిమెంటు ప్లాంట్, వ్యర్థపదార్థాల శుద్ధి కర్మాగార స్థాపనకు అనుమతి ఇచ్చేందుకు వారు ఆ లంచం తీసుకున్నట్లు ఆరోపణ. వీరభద్ర సింగ్ రాజీనామా చేయాలని అన్నా హజారే టీమ్ డిమాండ్ చేస్తుంది.

English summary

 A trial court in Shimla on Monday framed corruption charges against Union minister and former Himachal Pradesh chief minister Virbhadra Singh and his wife Pratibha Singh, four months before the state goes to the polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X