వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై దాడులు: మహారాష్ట్ర మంత్రి ఇంట్లో టెర్రరిస్టు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Abu Jundal - Taj Hotel
న్యూఢిల్లీ: ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది సయ్యద్ జబియుద్దీన్ అలియాస్ అబు జుందాల్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ముంబై దాడుల కేసులో అతన్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతను ముంబై 2009 ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్సీ నివాసంలో ఉన్నట్లు తెలుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ మంత్రిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ మంత్రి ఎవరనేది తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) జుందాల్‌ను తమ కస్టడీలోకి తీసుకునే నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. జుందాల్‌ను ఢిల్లీ పోలీసులు ఈ నెల 21వ తేదీన సౌదీ అరేబియా నుంచి వచ్చిన వెంటనే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు జుందాల్‌ను 15 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదే రోజు ఆదేశాలు జారీ చేసింది.

జుందాల్ కస్టడీని కోరుతూ ముంబై పోలీసులు తీజ్ హజరీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ముంబై దాడుల కేసులో అతన్ని ముంబైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఢిల్లీ పోలీసుల అభిప్రాయాన్ని కోరింది.

జుందాల్ అరెస్టు అయినట్లు వార్తలు వచ్చిన వెంటనే ముంబై కోర్టు సోమవారం అతన్ని తమ ముందు హాజరు పరచాలని ప్రొడక్షన్ వారంట్ జారీ చేసింది. అబూ జుందాల్‌ను తమ కస్టడీకి మరిన్ని రోజులు అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరే అవకాశం ఉంది. అతని ప్రస్తుత పోలీసు కస్టడీ జులై 5వ తేదీతో ముగుస్తుంది. కామన్‌వెల్త్ క్రీడలకు ముందు 2010లో జరిగిన జమా మసీద్ దాడి కేసుకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్ని జుందాల్ నుంచి రాబట్టేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary

 Even as the Delhi Police continues to interrogate Syed Zabiuddin alias Abu Jundal, arrested in connection with the 26/11 Mumbai terror attacks, sources said that the LeT terrorist might have stayed in the house of a Maharashtra MLC in Mumbai way back in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X