వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబూతో లింక్స్ లేవు, విచారణకు రెడీ: మహారాష్ట్ర మంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Abu Jundal
ముంబై: తనకు ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ జుందాల్ అలియాస్ జబియుద్దీన్‌ అన్సారీతో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర విద్యాశాఖ సహాయ మంత్రి ఫాజియా ఖాన్ ఖండించారు. మంత్రాలయ సమీపంలోని పాత లేజిస్లేచర్స్ హాస్టల్‌లోని మంత్రి గదిలో 2009లో అన్సారీ ఓ రోజు బస చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు ఖాన్ ఎమ్మెల్సీగా ఉన్నారు.

ప్రభుత్వ వసతుల్లో చాలా మంది బస చేస్తారని, బస చేసే ప్రతి ఒక్కరూ ఎవరో ఏమిటో తనకు తెలియాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలోకి తన పేరును ఎందుకు లాగారో తెలియడం లేదని, తనకు జుందాల్ తెలియదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిర్దోషినని నిరూపించుకోవడానికి తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు.

ఉగ్రవాదులతో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని ఆమె అన్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన జుందాల్ సౌదీ అరేబియాకు వెళ్లడానికి ముందు కొంత కాలం పాకిస్తాన్‌లో ఉన్నాడు. సౌదీ అరేబియాలో అతను టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఖాన్ కూడా అదే ప్రాంతానికి చెందినవారు.

జుందాల్‌కు కనీసం పది మారు పేర్లున్నాయి. కరాచీలోని కంట్రోల్ రూంలో ఉండి, ముంబై దాడిలో పాల్గొన్న పది మంది ఉగ్రవాదులకు సూచనలు ఇచ్చిన ఆరుగురిలో జుందాల్ కూడా ఉన్నాడు. ముంబై దాడుల్లో 166 మంది మరణించారు. ఉగ్రవాదులకు జుందాల్ హిందీ మాట్లాడడం నేర్పించాడు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన జుందాల్‌ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 21వ తేదీన పోలీసులు అరెస్టు చేసినట్లు సోమవారం బయటి ప్రపంచానికి తెలిసింది.

English summary
Maharashtra's minister of state for education Fauzia Khan on Tuesday denied any links with arrested 26/11 terrorist Abu Jundal alias Zabiuddin Ansari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X