వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు అప్పగించనంటే స్వీడన్ వస్తా: అసాంజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Julian Assange
సిడ్నీ: స్వీడన్ వెళ్లడానికి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్ దౌత్యపరమైన హామీలను కోరుతున్నారు. రహస్య పత్రాలను వెల్లడించినందుకు ఆరోపణలు ఎదుర్కుంటున్నందు ఆయన తనను అమెరికాకు అప్పగించనని హామీ ఇస్తే స్వీడన్ వస్తానని సోమవారం చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో విచారణను ఎదుర్కోవడానికి స్వీడన్ వెళ్లేందుకు 40 ఏళ్ల అసాంజ్ స్వీడన్ వెళ్తానని చెబుతున్నారు.

తాను స్వీడన్ వెళ్తే తనను స్టాక్‌హోమ్ అమెరికాకు అప్పగిస్తుందేమోనని ఆయన భయపడుతున్నారు. యుకె, అమెరికా, స్వీడన్ అసాంజ్‌కు ఏ విధమైన హామీలు ఇస్తాయనే విషయంపై వ్యవహారం ముందుకు సాగుతుందని ఆయన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో అన్నారు.

అఫ్గనిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించిన సున్నతమైన పత్రాలను, ఇతర వేలాది దౌత్యపరమైన కేబుల్స్‌ను అసాంజ్ వికీలీక్స్ ద్వారా బయటప్రపంచానికి వెల్లడించారు. ఈ వ్యవహారంపై అసాంజ్‌ను అమెరికా విచారించేందుకు సిద్ధపడుతోంది. దీంతో ఆయనను తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది.

గ్రాండ్ జ్యూరీ దర్యాప్తును నిలిపివేస్తామని, వికీలీక్స్ ప్రచురణలపై తదుపరి దర్యాప్తులు ఆపేస్తామని అమెరికా ప్రకటించాలని అసాంజ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే అసాంజ్‌కు కావాల్సిన ప్రధానమైన హామీ అని కూడా అంటున్నారు.

English summary
WikiLeaks founder Julian Assange on Monday called for diplomatic guarantees he will not be pursued by the United States for publishing secret documents if he goes to Sweden to face criminal allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X