అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య కేసు: భాను కిరణ్ డ్రైవర్ రమేష్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
అనంతపురం/హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నేర పరిశోధక విభాగం (సిఐడి) పోలీసులు భాను కిరణ్ డ్రైవర్ రమేష్‌ను అనంతపురం జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని నుంచి సిఐడి పోలీసులు బుధవారం ఓ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అనుచరుడు వంశీధర్ రెడ్డిని సిఐడి పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వంశీధర్ రెడ్డి కడప జిల్లాకు చెందినవాడు.

సూరిని హత్య చేసిన తర్వాత పారిపోవడానికి వంశీ భాను కిరణ్‌కు ద్విచక్రవాహనం ఇచ్చి సాయం చేశాడని ఆరోపణలున్నాయి. సూరి హత్యకు సంబంధించిన కుట్ర తనకేమీ తెలియదని, తాను వాహనం మాత్రమే ఇచ్చానని వంశీ సిఐడి అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఐపిసి 212 సెక్షన్ కింద పోలీసులు వంశీధర్ రెడ్డిని అరెస్టు చేశారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు ఎప్రిల్ 1వ తేదీన అరెస్టు చేశారు. ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే వచ్చారు.

సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ పారిపోయాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే భాను సూరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సూరి భాను కిరణ్‌ను తీవ్రంగా వేధించాడని, దాన్ని తట్టుకోలేక భాను సూరిని హత్య చేశాడని చెబుతూ వస్తున్నారు. భాను కిరణ్ అరెస్టుతో అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

English summary
CID police arrested Bhanu Kiran's driver Ramesh. Earlier an aide of gangster Bhanu Kiran was arrested by Crime Investigation Department (CID) officials in connection with the murder of faction lord Maddelacheruvu Suri on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X