వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అరెస్టు తప్పన్న సోనియా: పాల్వాయి, చిరుపై...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palvai Goverdhan Reddy
న్యూఢిల్లీ: ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చాలా దురదృష్టకరమని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయపడ్డారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మంగళవారం చెప్పారు. సిబిఐని తన వైపు నుండి, ప్రభుత్వం వైపు నుండి ఎవరూ గైడ్ చేయలేదని ఆమె చెప్పారన్నారు. ఆయన సోనియా గాంధీని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఎవరైనా అలా ఎందుకు గైడ్ చేశారో అర్థం కాలేదని, ఆ అరెస్టు తప్పనే అభిప్రాయంతో సోనియా ఉన్నారన్నారు. జగన్‌ను అరెస్టు చేయటం ద్వారా అనవసరంగా సానుభూతి పొందే అవకాశం కల్పించినట్లు అయిందన్నదే ఆమె అభిప్రాయమని పాల్వాయి పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని మేడమ్‌కు వివరించానని చెప్పారు. తెలంగాణపై కూడా సోనియా సానుకూలంగా ఉన్నారని, దానిపై అధిష్ఠానంలో తీవ్ర చర్చ జరుగుతోందని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే నిర్ణయం వస్తుందని అన్నారు.

తెలంగాణకు విలన్ కాంగ్రెస్సే అన్న కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన ఆవేశంతో ఏదేదో అనేస్తారని, అలా అనకుండా ఉండాల్సిందన్నారు. ఎవరైనా సరే హద్దుల్లో ఉండాలని సూచించారు. తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయాల్సి ఉందని, కానీ పార్లమెంటు సభ్యులు అలా చేయలేకపోయారని విమర్శించారు. గెలిచిన రెండు సీట్లు కూడా అభ్యర్థుల వ్యక్తతిగత బలంతోనే సాధ్యమైనట్లు చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దాలన్న ఉద్దేశ్యంతో అధిష్టానం ఉందన్నారు. అనంతపురం నుండి గుంటూరు దాకా పార్టీ బాగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణపై సోనియా పాజిటివ్‌గా ఉన్నారని చెప్పారు. జగన్‌ను తామేం తక్కువగా అంచనా వేయడం లేదన్నారు. ఉప ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు దురదృష్టకరమని చెప్పినప్పటికీ, ఆయన అరెస్టుపై మాత్రం పశ్చాత్తాపం ఏమీ వ్యక్తం చేయడం లేదన్నారు.

రామచంద్రాపురం, నరసాపురంలలో తన వల్లే గెలిచిందన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అన్నారు. పార్టీ గెలుపునకు చిరంజీవి ఒక్కరే కారణమని తాను భావించడం లేదన్నారు. కిందిస్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. నాయకత్వ మార్పుకు ఆస్కారాలు లేవన్నారు.

English summary
Rajyasabha Member Palvai Goverdhan Reddy met AICC president Sonia Gandhi on Tuesday. He said Sonia unhappy with YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's arrest before bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X