వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫైనాన్స్ వ్యాపారి హత్య: వరంగల్‌లో టిడిపి కార్యకర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. హైదరాబాదులోని గుడిమల్కాపుర్‌లో ఓ ఫైనాన్స్ వ్యాపారిని బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. మృతుడు సబ్జి మండికి చెందిన విద్యానంద్ ఓ ఫైనాన్స్ వ్యాపారిగా గుర్తించారు. శివబాగ్ చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో అతనిని నరికి చంపారు. తాను ఫైనాన్సు రూపంగా ఇతరులకు ఇచ్చిన డబ్బులను వసూలు చేసుకొని వెళుతుండగా దుండగులు తల్వార్‌లో దాడి చేసి హత్య చేశారు.

వారు వెంటనే అక్కడ నుండి పారిపోయారు. హత్యకు ఉపయోగించిన తల్వార్‌లను కూడా వెంట తీసుకు వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మృతుడు ఫైనాన్స్ వ్యాపారి ఆ కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పాతకక్షలే కారణం కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ దారుణ హత్యకు గురయ్యారు. మరిపెడ మండలం తాళ్లఊకల్‌లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. పాతకక్షలు మనసులో పెట్టుకున్న కాంగ్రెసు వర్గీయులు వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న టిడిపి నేత రామన్నపై కర్రలు, గొడ్డలితో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. రామన్న హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తండ్రిని చంపాడు. మాక్లూర్ మండలం చిన్నాపూర్‌కు చెందిన సాయన్న అతని కొడుకు సంతోష్ మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. సంతోష్ ఆవేశం పట్టలేక పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై మోదాడు. దీంతో అతను అక్కడికక్కడమే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary

 Telugdesam Party activist Ramanna was killed on Tuesday night in Warangal district. A finance businesman also killed in Hyderabad at Gudimalkapur on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X