వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏథెన్స్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంపై దాడి, మంటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Microsoft's Greece office attacked
ఏథెన్స్: ప్రపంచ ప్రసిద్ధమైన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ గ్రీసు కార్యాలయంపై దుండగులు దాడి చేసారు. దుండగులు ఏథెన్స్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయాల భవనంలోకి వ్యాన్‌లో ప్రవేశించి, పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దాంతో భవనం ప్రవేశద్వారం దగ్ధమైంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఏథెన్స్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయ భవనంలోకి దూసుకొచ్చిన వాహనంలో మూడు ప్రమాదకరమైన గ్యాస్ బండలు, ఐదు క్యాన్‌లో గ్యాసోలైన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏ విధమైన ప్రాణహాని జరగలేదని తెలుస్తోది. గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ నష్టం జరిగినట్లు, మైక్రోసాఫ్ట్ ఈ రోజు పనిచేయనది పోలీసు అధికార ప్రతినిధి థానసిస్ కక్కోలకిస్ చెప్పారు.

దాడికి కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణులు వ్యాన్‌ను తనిఖీ చేశారు. గ్రీసులో స్థానిక ఉగ్రవాద గ్రూపులు ప్రభుత్వ భవనాలను, బ్యాంకులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం పరిపాటి. ఈ దాడికి ఎవరు కారణమనేది తెలియదు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను దుండగులు అక్కడి నుంచి పంపించివేసి పేలుళ్లకు పాల్పడ్డారు.

స్థానిక ఉగ్రవాద గ్రూపుల దాడుల వల్ల సాధారణంగా గాయాలు మాత్రమే అవుతుంటాయి. రాత్రుళ్లు పొద్దుపోయిన తర్వాత ఉగ్రవాదులు సాధారణంగా దాడులు చేస్తుంటారు.

English summary
Global information technology powerhouse Microsoft had to witness the worst attack when assailants set fire to the IT firms Greece office. The attackers reportedly drove their van through the front door and set off inflammable objects that led to the building entrance being burnt down completely. The incident happened on early Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X