వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ ఎన్‌కౌంటర్: 17 మంది మావోయిస్టుల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

CRPF guns down 17 Naxals in Chhattisgarh encounter
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు వేర్వేరు భారీ ఎన్‌కౌంటర్‌లు జరిగినట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిహేడు మంది నక్సలైట్‌లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) జవాన్లు శుక్రవారం ఉదయం బీజాపూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

ఇది తెలుసుకున్న నక్సలైట్‌లు బాసగూడ సమీపానికి జవాన్‌లు వచ్చాక వారిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అఫ్రమత్తమైన సిఆర్‌పిఎఫ్ జవాన్‌లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ జవాన్‌లను రాష్ట్ర రాజధాని రాయపూర్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇద్దరు జవాన్‌లకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఎదురు కాల్పులు దాదాపు ఆరు గంటలు సాగాయని సమాచారం. అవసరమైతే అదనపు బలగాలను పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్పుల అనంతరం సిఆర్‌పిఎఫ్ జవాన్‌లు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకొని వారిని రాయపూర్ తరలించారు. గాయపడ్డ ఆరుగురు జవాన్‌లలో ఇద్దరు కోబ్రా కమాండోస్‌కు చెందిన వారిని అధికారులు చెప్పారు. కాగా ఇదే ప్రాంతంలో రెండేళ్ల క్రితం మావోల దాడిలో 75 మంది సిఆర్‌పిఎఫ్, ఒక పోలీసు మృతి చెందారు.

English summary
At least 18 suspected Naxalites have been killed and six CRPF men critically injured after a fierce overnight encounter in the jungles of Dantewada in Chhattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X