హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధిష్టానంపైనే పోరు: కాకా, ఏ నిర్ణయమైనా సరే: గౌడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkataswamy-Devender Goud
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కోసం తెలంగాణవాదులు వ్యక్తులతో కాకుండా కేంద్రం, పార్టీ అధిష్టానాలతో కొట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) అన్నారు. యుపిఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ గెలుపు ఖాయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఏ విషయంలోనైనా కేంద్రాన్ని ఒప్పించే సమర్ధుడు ప్రణబ్ ముఖర్జీ అని ఆయన అన్నారు.ప్రణబ్ తనకు మంచి స్నేహితుడని కాకా అన్నారు. ఆయనకు రాష్ట్రంలో ఏ పార్టీ ఓటు వేసినా, వేయకున్నా ఆయన రాష్ట్రపతిగా గెలుస్తారని జోష్యం చెప్పారు. ప్రణబ్ మృదు స్వభావి అని కాకా కితాబునిచ్చారు.

తెలంగాణకు సమస్యను పరిష్కరించే విషయంలో రాయల తెలంగాణ అంటూ కొత్త సమస్య సృష్టించవద్దని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఓ అడుగు ముందుకేసి తెలంగాణపై కాంగ్రెసు వైఖరి తెలిపితేనే మిగతా పార్టీ తెలిపేందుకు సిద్ధపడతాయని అన్నారని, తాము కూడా అదే అంటున్నామని, కాంగ్రెసు తెలంగాణపై వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేని పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి బిసీలు దూరమైన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వడంలో తమ పార్టీ ముందుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బిసీల గురించి పట్టించుకున్న నాథుడే లేడని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫవమైందని ఆయన అన్నారు.

English summary
Congress senior leader G Venkataswamy (Kaka) said that Telanganites should fight for Telangana on Congress high command and the Union government. TDP Rajyasabha member said that they will cooperate with the union government in solving Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X