హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్‌తో భేటీ ఉంటుందో, లేదో చెప్పలేను: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palvai Govardhan
హైదరాబాద్: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో భేటీ ఉంటుందో, ఉండదో చెప్పలేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు ఆయన బుధవారం ఢిల్లీ వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మంచినీరు, సాగునీటి కోసం ఉద్యమిస్తానని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అన్నారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని, దానిపై తెలంగాణకు చెందిన మంత్రులు, శానససభ్యులు మాట్లాడకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, శానససభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని ఆయన సూచించారు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, నాగార్జున సాగర్ నీటి మట్టం 510 అడుగులకు చేరితే హైదరాబాదుకు నీరు ఇవ్వడం కష్టమని ఆయన అన్నారు.

రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెట్టిన రాహుల్ గాంధీ చర్చల కోసం పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ ప్రాబల్యంపైనా, తెలంగాణ అంశంపైనా రాహుల్ గాంధీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో మాట్లాడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన పాల్వాయితో మాట్లాడుతారు.

English summary
Congress Telangana region Rajyasabha member Palcai Govardhan Reddy said the meeting with Congress president Sonia Gandhi's son and AICC general secretary Rahul Gandhi is uncertain. He said that Congress party situation is bad in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X