హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ విక్టరీకి....: శంకరన్న, కలుపుమొక్కలు: పనబాక

By Pratap
|
Google Oneindia TeluguNews

Panabaka Lakshmi-P Shankar Rao
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించడానికి తమ పార్టీలోని పెద్దలే కారణమని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పి. శంకరరావు అన్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులే ఆ పెద్దలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ఎన్నికల సమీక్షకు మంత్రుల కమిటీ వేయడం వల్ల ఫలితం ఉండదని ఆయన అన్నారు.

ఉప ఎన్నికలకు ఫలితాలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెంటనే తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని మార్చకపోతే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బతకదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తప్ప మిగతా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తాను స్వాగతిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెసు పార్టీ గెలిచిందని, సీమాంధ్ర నాయకుడు పిసిసి ఉన్నప్పుడు కాంగ్రెసు విజయం సాధించిన ఉదంతాలు లేవని ఆయన అన్నారు.

పార్టీలో కలుపు మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరి వేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. కాంగ్రెసు పార్టీలోని కలుపు మొక్కలను ఏరివేసే పరిస్థితి ఉందని ఆమె అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చర్యలు తీసుకుంటారని ఆమె అన్నారు. కాంగ్రెసు 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని, ఎవరో వ్యక్తులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని ఆమె అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లడంలో విఫలమయ్యామని ఆమె అన్నారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె మంగళవారం గుడివాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు చేసినవేనని, ఎవరో జేబు నుంచి ఇచ్చినవి కావని ఆమె అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న జలాలు దిగువకు వదలకపోతే మన పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. 2014లో కాంగ్రెసు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Congress senior MLA and Former Minister P Shankar Rao demanded CM Kiran Kumar Reddy and PCC President Botsa Satyanarayana to step down from their respective posts, taking responsibility of party defeat in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X