హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ పేరుతో చీట్: సీనియర్‌కు అసిస్టెంట్ చెప్పుదెబ్బలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ సీనియర్ న్యాయవాదిని ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. హబ్సిగూడలో ఉంటున్న సాయిబాబు న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన అన్నపూర్ణ అనే మహిళ ఉదయం ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించారు.

ఆమెకు పలు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. అన్నపూర్ణను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చే వరకు తాము ఆందోళన విరమించేది లేదని మహిళా సంఘాలు హెచ్చరించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు న్యాయవాది ఇంటికి చేరుకున్నారు. అన్నపూర్ణ వివాదంపై సాయిబాబా వివరణ ఇస్తున్న సమయంలో బాధిత మహిళతో పాటు మరో ఇద్దరు అతనిపై చెప్పులతో దాడి చేశారు. వారి బారి నుండి తప్పించిని పోలీసులు అతనిని తమ అదుపులోకి తీసుకున్నారు.

అతనిపై కేసు నమోదు చేశారు. అతను సిటీ సివిల్ కోర్టులో పని చేస్తున్నట్లుగా సమాచారం. అన్నపూర్ణ రెండేళ్ల పాటు అతని వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. అప్పుడు వారి మధ్య ఉన్న స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. తాను అతని వద్ద జూనియర్‌గా పని చేస్తుండగా పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడని అన్నపూర్ణ ఆరోపిస్తున్నారు. తనను పని చేసినంత కాలం వాడుకొని, తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె ఆరోపించారు.

పెళ్లి చేసుకుంటాడని తాను నమ్మితే ఆ తర్వాత తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. తన వద్ద రెండేళ్ల పాటు అసిస్టెంటుగా పని చేసిందని సాయిబాబా తెలిపారు. తప్పుడు ఆరోపణలతో తన కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేసిందని ఆయన చెబుతున్నారు. తన సోదరికి కూడా తన గురించి తప్పుగా చెప్పిందని ఆయన ఆరోపించారు.

English summary

 A senior lawyer slapped with chappal by his assistant Annapurna on Tuesday in Hyderabad. Annapurna alleged that he has cheated her with love. OU police put case against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X