వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు చేదు అనుభవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vemuri Radhakrishna
భీమవరం/ విశాఖపట్నం: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చేదు అనుభవం ఎదురైంది. అల్లూరి సీతారామారాజు యువసేన ఆయనను భీమవరం రైల్వే స్టేషన్‌లో అడ్డుకుంది. గత నెల 5వ తేదీన అల్లూరి చరిత్రలో వాస్తవాలు అనే శీర్షికతో ఓ వ్యాసాన్ని ప్రచురించారు. అల్లూరి సీతారామారాజును కించపరుస్తూ ఆ వ్యాసం ప్రచురించారని ఆరోపిస్తూ అందుకు రాధాకృష్ణ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని యువసేన డిమాండ్ చేసింది.

ఆ తర్వాత ఆయన అల్లూరి సీతారామారాజు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు అల్లూరు సీతారామారాజు భవనానికి రాధాకృష్ణ చేరుకున్నారు. అక్కడ కూడా ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. రాధాకృష్ణ గో బ్యాక్, గోబ్యాక్ అంటూ అల్లూరి సీతారామారాజు యువసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య రాధాకృష్ణను అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు.

ఇదిలావుంటే, విప్లవ వీరుడు అల్లూరి సీతా రామరాజు జయంతి వేడుకలు విశాఖపట్నంలో బుధవారం ఘనంగా జరిగాయి. సీతమ్మధార జంక్షన్‌లోని అల్లూరి విగ్రహానికి అఖిల పక్షథ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే ధర్నా చేశారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అల్లూరి సీతా రామారాజుకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు విమర్శించారు.

విశాఖపట్నం జిల్లాకు అల్లూరి జిల్లాగా నామకరణం చేయాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరి సీతా రామారాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేశారు. మన్యం ప్రజలను కూడగట్టి ఆయన స్వాతంత్ర్య సమరం నడిపారు.

English summary

 Alluri Seetharama Raju Yuvasena workers tried to obstruct Andhrajyothy managing director Vemuri Radhakrishna in protest against an article published in his news paper on Alluri Seetharama Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X