వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానందకు కాలిఫోర్నియా కోర్టు షాక్: ట్రస్టు ఫ్రాడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామి వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. ఆయన నిర్వహణలోని ట్రస్టును అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు పెద్ద ఫ్రాడ్‌గా తేల్చింది. ఈ ట్రస్టుకు అమెరికాలో కన్వీనర్‌గా ఉన్న నిత్య గోపాలానంద అలియాస్ గోపాల చిన్నారెడ్డికి ఈ నెల 19న తగిన శిక్ష విధించనున్నట్లు కోర్టు ప్రకటించింది.

2010 లోనే ఆశ్రమంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇతనిని కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రవాస భారతీయులైన భక్తుల నుంచి వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో ట్రస్టు స్వీకరించిందని, అయితే ప్రకటించిన కార్యక్రమాలకు బదులు అభ్యంతరకరమైన, అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తోందని మఫత్‌లాల్ చావ్లా అనే భక్తుడు అమెరికా కోర్టులో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

తాను విరాళంగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని చావ్లా కోర్టుకు విన్నవించుకోవడంతో 1.6 బిలియన్ల డాలర్ల మొత్తాన్ని ఆయనకు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా, భక్తులతో తాంత్రిక్ సెక్స్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న మాట నిజమేనని విచారణ సందర్భంగా నిత్య గోపాలానంద అంగీకరించినట్లు తెలిసింది.

ఈ తాజా పరిణామంతో నిత్యానందస్వామి మెడకు కొత్త వివాదం చుట్టుకుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో గల అధీనం మఠంలో నిత్యానందుడు తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని ధ్యానపీఠాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయడంతో దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.

English summary
California court has given shock to Nithyananda Swami and ruled that his trust in USA is a fraud. Chawla complained to the court about Nithyananda Swami's trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X