వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంతో తేల్చుకుంటా: సహచర మంత్రి కిషోర్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram - Kishore Chandra Dev
న్యూఢిల్లీ: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ పైన కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్ కేంద్ర కేబినేట్‌లోనే చిచ్చు రేపిందనే చెప్పవచ్చు. సహచర మంత్రి చిదంబరంపై నిప్పులు చెరిగారు. యువకులను అన్యాయంగా చంపుతున్నారని మండిపడ్డారు. ఆ ఎన్‌కౌంటర్ సరికాదంటూ కేంద్ర గిరిజన శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని నేరుగా హోంమంత్రి చిదంబరంతోనే తేల్చుకుంటానని చెప్పారు. పూర్తి స్థాయి సమాచారం కోసం ఎదురు చూస్తున్నానని పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నాక తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని తేల్చి చెప్పారు.

ఆ ఎన్‌కౌంటర్ సందర్భంగా చనిపోయిన వారిలో సగానికిపైగా యువకులేనని అన్నారు. మావోయిస్టులా? మామూలు ప్రజలా అన్న విషయం బుల్లెట్లకు తెలియదని వాళ్లు చెబుతున్నారని కానీ, తుపాకుల వెనక ఉండే వ్యక్తులు వారిని గుర్తించగలరు కదా అని ఆయన ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో రికార్డు స్థాయిలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన మంత్రి అక్కడ పని చేస్తున్న సల్వాజూడుం చర్యలను ఒక పార్లమెంట్ సభ్యునిగా తాను అంగీకరించలేనని స్పష్టం చేశారు.

దీంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. బీజాపూర్ ఎన్‌కౌంటర్ ముందస్తు వ్యూహంతో చేసింది కాదని, ఇటువంటి విషయాలను రాజకీయం చేయడం సరికాదని ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ హితవు పలికారు. మంగళవారం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించిన 150 మంది గిరిజన విద్యార్థులను ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులు తమను తాము రక్షించుకునేందుకు అమాయక గిరిజనులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, కానీ తమ ప్రయత్నాలను మావోయిస్టులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాగా, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులను ప్రధాని అభినందించారని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఈ ప్రతిభావంతులు దేశ బంగారు భవిష్యత్తులో వారు భాగస్వాములని కితాబునిచ్చారని ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో విద్యార్థులు పోటీ పరీక్షలకు ఇక్కడి విద్యార్థులు సంసిద్ధులయ్యేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని సిఎం తెలిపారు. భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ప్రణాళికా రచన కోసం పెద్ద ఎత్తున మావోయిస్టు నేతలు అక్కడ వచ్చారని సిఆర్‌పిఎఫ్పేర్కొంది. బీజాపూర్ అడవులలో అర్ధరాత్రి పూట పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ సమావేశాన్ని నక్సల్స్ నేతలు అందుకోసమే ఏర్పాటు చేశారని సిఆర్‌పిఎఫ్ డిజి తెలిపారు. గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై హోంమంత్రి చిదంబరం, హోం కార్యదర్శి ఆర్.కె.సింగ్‌లకు ఆయన ఒక నివేదిక ఇచ్చారు.

English summary
Amid severe criticism of its action that resulted in killing of innocent villagers during shootout with Maoists in Chhattisgarh last week, the CRPF — in its report to the Union home ministry on the incident — on Tuesday claimed that it was "a chance encounter" and the troop had no option but to retaliate fire from the Naxalites when it was moving to the area to take action against on the basis of specific intelligence input.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X