• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అబ్దుల్ కలాంకు మంత్రి పదవి: 98లో వాజపేయి ఆఫర్

By Srinivas
|

AB Vajpayee - APJ Abdul Kalam
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆ పదవిలో కూర్చోవడానికి నాలుగేళ్ల ముందే కేంద్రమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చింది. 1998లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరాలంటూ కలాంను ఆహ్వానించారు. అయితే కాలం ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇటీవల రాసిన టర్నింగ్ పాయింట్స్ పుస్తకంలో కలాం ఈ విషయాలను పేర్కొన్నారు.

వాజ్‌పేయి అహ్వానాన్ని అంగీకరించి ఉంటే రాష్ట్రపతిగా ఎంపిక కాక ముందు అబ్దుల్ కలాం కేంద్ర మంత్రి అయ్యేవారు. వాజ్‌పేయి కోరిక తీరి ఉంటే కలాం కేంద్ర మంత్రిగా మరో కొత్త పాత్రలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించేవారు. అయితే, ఆయన అప్పటికే దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నందున వాజ్‌పేయి ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు.

1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఏడాది మార్చి 15న అర్ధరాత్రి వాజ్‌పేయి నుంచి ఫోన్ వచ్చిందని, తాను కొత్త మంత్రివర్గం ఏర్పాటు కోసం జాబితా సిద్ధం చేస్తున్నానని తనను కూడా అందులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తనకు చెప్పారని, దీంతో తాను కొంత సమయం ఇస్తే ఆలోచించుకుని చెబుతానని బదులిచ్చానని, ఆలోచించుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి కోరారని, అప్పటికప్పుడు తన సన్నిహిత మిత్రులతో సంప్రదింపులు మదలు పెట్టానని, తెల్లవారుజామున మూడు గంటల వరకూ మాట్లాడుకుంటూనే ఉన్నామని, ఆ తర్వాత రోజు ఉదయం తాను ప్రధాని నివాసానికి వెళ్లి, మంత్రివర్గంలో చేరరాదన్న నిర్ణయాన్ని చెప్పానని కాలం తన పుస్తకంలో పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ బృందం దేశ ప్రయోజనాలకు సంబంధించి కీలకమైన రెండు బాధ్యతలు నెరవేర్చడంలో తలమునకలై ఉందని, ఒకటి అగ్ని క్షిపణిని అభివృద్ధి పరచడం, రెండోది అణు కార్యక్రమానికి చెందిన వరుస పరీక్షలు నిర్వహించడమని, ఈ రెండు పనులు ఎంతో కీలకమైనవని, తన పూర్తి సమయాన్ని వాటికి సంబంధించిన పనుల కోసం వెచ్చించాల్సి ఉందని, దేశం కోసం ఈ పనులు చేసేందుకు మీరు అనుమతిస్తే ముందుకు సాగుతాను అని చెప్పానని రాశారు. దీంతో మీ భావాలను తాను అభినందిస్తున్నానని, మీ లక్ష్య సాధనలో మీరు ముందుకు సాగిపోవచ్చని వాజ్‌పేయి బదులిచ్చారని కలాం పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Prime Minister AB Vajpayee wanted to induct APJ Abdul Kalam as a minister in the NDA government in 1998, an offer Kalam declined, four years before he became the President in 2002.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more