వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సృష్టికి మూలం ఈ దైవ కణాలే కావచ్చు: శాస్త్రవేత్తలు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Scientists may have discovered God particle
జెనీవా/లండన్: సిఇఆర్ఎన్ శాస్త్రవేత్తలు కొత్త ఉపఅణు కణాలను కనుక్కున్నారు. హిగ్స్ బోసన్ అనే ఈ దైవకణాలే విశ్వసృష్టికి మూలం కావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలు కొనసాగుతున్నాయని, పరిశోధనలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని వారు చెబుతున్నారు. హిగ్స్ బోసన్ సిద్ధాంతానికి అనుకూలంగానే తాము కనుక్కున్న కణాలు ఉన్నాయని యుకె శాస్త్రసాంకేతిక వసతుల మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ వొమెర్‌స్లే అన్నారు. లండన్‌లో ఆ విధంగా అన్నారు.

హిగ్స్ కణాల కోసం అన్వేషణ సాగిస్తున్న రెండు బృందాల్లో ఒక బృందం అధికార ప్రతినిధి జో ఇన్‌కాండెలా జెనీవాలోని సిఇఆర్ఎన్ వద్ద మాట్లాడుతూ - ఇది ప్రాథమిక ఫలితం మాత్రమేనని, అయితే అత్యంత పటిష్టమైన, సాంద్రత కలిగిన కణాలని అన్నారు.

విశ్వం పనిచేసే విషయంపై మేధో చట్రం వివరిస్తున్న ప్రామాణిక నమూనాలతో సరిపోలినప్పుడు మాత్రమే ఈ దైవ కణాలకు విశిష్టత ఉంటుంది. దీన్ని 1970 ప్రాంతంలో రూపొందించారు. 14 ఏళ్ల క్రితం బింగ్ బాంగ్ రూపొందించిన బిగ్ బాంగ్ ప్రామాణిక నమూనా గురించి వివరిస్తుంది. కొన్ని కణాలకు ఇతర కణాలకు లేని శక్తి ఉంటుందని ఆ సిద్ధాంతం చెబుతుంది.

విశ్వసృష్టికి సంబంధించి హిగ్స్ బోసోన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. బ్రిటిష్ పరిశోధకుడు పీటర్ హిగ్స్ పేరు మీద ఈ కణాలకు పేరు పెట్టారు. ఈ సిద్ధాంతంపై హిగ్స్ పనిచేస్తూ వచ్చారు. హిగ్స్‌బాసన్ కణాల వల్లే పరమాణువులకు ద్రవ్యరాశి ఉంటుందని, దాని వల్లే ఈ విశ్వం ఏర్పడిందని భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దైవకణం లేకపోతే అణువులు ఏర్పడం సాధ్యం కాదని, దాంతో విశ్వంలో గ్రహాల దగ్గరి నుంచి జీవం వరకు దేనికీ స్థానం ఉండేది కాదని పరిశోధకుల అంచనా. ఈ దైవకణాన్ని కనుగొనడానికి స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో 'సెర్న్' ఓ భారీ భూగర్భ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించింది.

ఇందుకోసం 'లార్జ్ హాడ్రన్ కొల్లైడర్' అనే 18మైళ్ల పొడవైన సొరంగాన్ని ఏర్పాటు చేసింది. విశ్వం ఆవిర్భావానికి మూలంగా భావిస్తున్న బిగ్ బ్యాంగ్(మహా విస్ఫోటం)ను ఈ సొరంగంలో కృత్రిమంగా సృష్టించింది. రెండు ఫొటాన్ పరమాణువులను కాంతి వేగంతో ఢీకొట్టించడం వల్ల జనించే మూలకాలపై పరిశోధన జరిపింది. ఇందులో హిగ్స్ బాసన్ కణం ఉనికిని తాజాగా కనుగొన్నట్లు సమాచారం. రెండు శాస్త్రవేత్తల బృందాలు వేర్వేరుగా ఈ పరిశోధనలు జరిపాయి.

English summary
Scientists at the CERN research centre near Geneva said today that they have found a new subatomic particle that may well be the Higgs boson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X