వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవినేని ఉమ తీరు: నైరాశ్యంలో జూ.ఎన్టీఆర్ టీమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr - Devineni Umamaheswar Rao
విజయవాడ: కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు పొంచి ఉన్నట్లే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా అత్యంత ముఖ్యమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తుంటే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు వ్యవహారశైలిపై జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడానికి ఆ అసంతృప్తే కారణమని అంటున్నారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అలాగే, వల్లభనేని వంశీ కూడా దేవినేని ఉమామహేశ్వర రావు వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. అయితే, ఆయన ఇటీవల విజయవాడలో ఫ్లైఓవర్ కోసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ప్రముఖంగా కనిపించారు.

దేవినేని ఉమామహేశ్వర రావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన కృష్ణా జిల్లా నాయకులు భావిస్తున్నారు. దాంతో ఆయనపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, చంద్రబాబు మద్దతు ఎల్లవేళలా దేవినేని ఉమామహేశ్వర రావుకే లభిస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా సరైన దిశానిర్దేశం లేదని అంటున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు కొందరు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య కూడా నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. చిన్నం రామకోటయ్యకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు. అందుకు కారణం ఏమిటో తెలియదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బయటకు వస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత గుంటూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబును కలిసి మనసు మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.

English summary

 Avvording to political analysts - Jr NTR team in Krishna district Telugudesam party is disgruntled with the working style of district party president and MLA Devineni Umamaheswar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X