హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేక్ ప్రొఫైల్: యువతికి ఐఐటి విద్యార్థి ఇంటర్నెట్ వేధింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: తోటి విద్యార్థినికి అసభ్య ఈ-మెయిల్స్ చేస్తూ వేధిస్తున్న ఐఐటి ఢిల్లీ విద్యార్థిని శనివారం పోలీసులు అరెస్టు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహబూబాబాద్‌కు చెందిన సురేందర్ అనే వ్యక్తి ఢిల్లీలో ఐఐటి చదువుతుండగా ఓ విద్యార్థిని పరిచయమయింది. ఆమె కూడా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన అమ్మాయే.

ఐఐటిలో సీటు సాధించడానికి అవసరమైన సమాచారం కోసం ఆమె సురేందర్ సహాయాన్ని తీసుకుంది. ఆ తర్వాత ఆమెతో స్నేహం ప్రారంభించిన సురేందర్ ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కూడా ఐఐటి సీటు దక్కించుకుంది. తాను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకోవాలని ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్ ద్వారా ఆమెను వేధింపులకు గురి చేశాడు.

ఆమె ఫోటోలను సంపాదించి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ఇంటర్నెట్‌లో ఉంచాడు. ఈ వ్యవహారంపై కాన్పూర్, మహబూబాబాదులలో ఆ యువతి ఫిర్యాదు మేరకు మూడు కేసులు నమోదయ్యాయి. అయినా సురేందర్ వైఖరి మారలేదు. ఆమెను నిత్యం వేధించేవాడు. తనను వివాహం చేసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడు. సురేందర్ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది.

ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. దీంతో అతను అమ్మాయి సోదరి పేరిట ఒక వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ ప్రారంభించాడు. ఆ ప్రొఫైల్‌లో అసభ్యకరమైన ఫోటోలు ఉంచి, బాధితురాలైన తల్లి సెల్ ఫోన్ నెంబర్‌ను అందులో ఉంచాడు. దీంతో అపరిచితుల నుండి వచ్చే ఫోన్ కాల్స్‌తో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సురేందర్ వ్యవహారశైలితో విసిగిపోయిన బాధిత కుటుంబం సిఐడిలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ఇంటర్నెట్‌కు సంబంధించిన ఐపి నెంబర్, మొబైల్ ఫోన్‌ల ఆధారంగా సురేందర్‌ను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు బాధితురాలికి బెదిరింపు మెసేజ్‌లు కూడా చేశాడు. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు.

English summary
An IIT-Delhi student was arrested by the Andhra 
 
 Pradesh CID cyber crime sleuths for harassing a girl 
 
 by uploading obscene content and sending her vulgar 
 
 emails.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X