వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నిక: హైదరాబాదులో వైయస్ జగన్ ఓటు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ఓటు వేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాదులో ఓటు వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వైయస్ జగన్ ఎన్నిక కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్నికల కమిషన్‌ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన సుప్రీంకోర్టును కూడా కోరారు. సుప్రీంకోర్టులో సోమవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే. కేసులో నిందితుడిగా జైలులో ఉన్న శానససభ్యుడు గానీ పార్లమెంటు సభ్యుడు గానీ తన ఓటును వినియోగించుకునే హక్కును కలిగి ఉంటాడు.

జైలులో ఉన్న ప్రజాప్రతినిధి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుడు శాసనసభ ఆవరణలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ, సంగ్మాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై వైయస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ వైయస్ జగన్‌కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. వైయస్సార్ కాంగ్రెసుకు 17 మంది శానససభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీరంతా జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారు.

English summary

 YSR Congress party president and Kadapa MP YS Jagan urged EC to give permission to cast his vote in Hyderabad in presidential election. He has written a letter to secretary of EC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X