చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో కామెంట్, బాగా తెలుసు: 'తారాచౌదరి'పై రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
చిత్తూరు: వ్యభిచార రాకెట్ ఆరోపణలు ఎదుర్కొన్న తారా చౌదరి విషయంలో తాను ఏమీ మాట్లాడబోనని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం అన్నారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తారతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన గురించి తార ఎన్ని విధాలుగా ప్రచారం చేసుకున్నా పట్టించుకోనని చెప్పారు.

తానేమిటో, తన కుటుంబమేమిటో ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. ఆమె విషయంలో తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. మరోవైపు తారా చౌదరి ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అదిలాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు జోగు రామన్న స్పష్టం చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. అయితే తారా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి కాదని తెలుస్తోంది.

కాగా తనను ఓ పార్లమెంటు సభ్యుడు, ఓ శాసనసభ్యుడు, డిజి, డిఎస్పీ, సిఐ వేధించారని వ్యభిచార వ్యవహారం కేసులో అరెస్టయి ఇటీవల విడుదలయిన వర్ధమాన నటి తారా చౌదరి అన్న విషయం తెలిసిందే. ఆమె ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లోని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆదివారం పలు విషయాలను చెప్పారు. అప్పట్లో పరిశ్రమలో చౌదరీల డామినేషన్ ఉండేదని, కొందరు తనను తార-సితార అని పిలిచే వారని ఆ తర్వాత క్రమంగా తారా చౌదరిగా మారిపోయిందని చెప్పారు.

వ్యభిచారం కేసులో తనను కావాలనే ఇరికించారని ఆమె చెప్పారు. తనకు సినిమాలు, రాజకీయాలు, సమాజ సేవ అంటే ఇష్టమని తెలిపారు. తాను నటన మానుకుందామనుకున్న సమయంలో ఓ కోఆర్డినేటర్ తనను చిన్ని కృష్ణ వద్దకు తీసుకు వెళ్లాడని, ఆ తర్వాత చిన్ని కృష్ణ తనను వేధించాడని ఆమె చెప్పారు. తనను పోలీసు అధికారి శంకర రెడ్డి కూడా వేధించారని తెలిపారు. చిన్ని కృష్ణ తనతో వల్గర్‌గా మాట్లాడేవారని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై రాయపాటి, అదిలాబాద్ ఎమ్మెల్యే స్పందించారు.

English summary

 Guntur MP Rayapati Sambasiva Rao did not like to respond on Tara Choudary comments against him. He was offered prayer at Tirumala Srivenkateshwara Swamy on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X