వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ రావుపై విజయ సాయిరెడ్డి పరువు నష్టం దావా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: ఈనాడు పత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీ రావు, ఆయన తనయుడు, ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ పైన, ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడు విజయ సాయి రెడ్డి పరువు నష్టం దావా వేశారు. 'లబ్ధి పొందింది జగనే' అనే శీర్షికతో ఏప్రిల్ 28న ఈనాడు పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది.

దానిపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లారు. ప్రజలకు తప్పుడు సమాచారం అందించేలా, కోర్టులో జరిగిన వాదనల్ని ఆ పత్రిక వక్రీకరించిందన్నారు. తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సందర్భంగా సీనియర్ న్యాయవాది సుశీల్‌ కుమార్ వాదనలు వినిపించారని, వాటిని ఈనాడు వక్రీకరించిందన్నారు. బిపి ఆచార్య భూములు కేటాయించగా.. జగతి సంస్థలోకి పెట్టుబడులు వచ్చాయని, అందులో లబ్ధి పొందింది జగనే తప్ప, విజయ సాయి రెడ్డి పొందింది ఏమీ లేదన్నట్లు రాశారని, కానీ వాస్తవానికి సుశీల్‌ కుమార్ అలా అనలేదని సాయి రెడ్డి చెప్పారు.

వాస్తవానికి ఆ రోజు సిబిఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ మారుతి శర్మ ఎదుట సుశీల్‌ కుమార్ వాదనలు వినిపించారని, జగతిలోకి వచ్చిన పెట్టుబడులు నిజమైనవేనని, అందులో ఎలాంటి తప్పులు జరగలేదని, తమ క్లయింట్‌కు ఐపిసి 409, 420 సెక్షన్లు వర్తించవని మాత్రమే ఆయన చెప్పారన్నారు. వాటిని ఈనాడు వక్రీకరించి రాయడం ప్రెస్‌ కౌన్సిల్ నైతిక నియమావళికి విరుద్ధమన్నారు.

విజయ సాయి రెడ్డి సిబిఐ లీకుల్ని కూడా ప్రస్తావించారు. సిబిఐ లీకుల వల్ల ప్రధానంగా ఈనాడు పత్రిక లబ్ధి పొందుతోందన్నారు. జగతి కేసులో చార్జిషీట్లలోని అంశాలను కూడా ఈనాడు ప్రచురిస్తోందని, సాక్షి పత్రికకు వ్యతిరేకంగా సిబిఐ దర్యాప్తు సాగుతోందని ఆరోపించారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా ఈనాడు వార్త ప్రచురించిందని తద్వారా తనకు వృత్తిపరంగా కూడా నష్టం వాటిల్లుతుందన్నారు.

English summary
Jagathi Publications vice chairman Vijay Sai Reddy, who is accused no 2 in the Jagan illegal assets case, has filed a defamation case against Eenadu chairman Mr Ramoji Rao, for making scandalous statements about him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X