విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నం కూడా జగన్ వైపే?: భేటీపై కొడాలి నానికి బాసట

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Chinnam Ramakotaiah
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కలవడాన్ని నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య సమర్థించారు. పార్టీలు వేరయినప్పటికీ ఇతర పార్టీల నేతలను కలవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.

ఉప ఎన్నికలలో గెలుపు ద్వారా జగన్ పార్టీకి ప్రజలలో ఆదరణ ఉందని అర్థమవుతోందన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అని చెప్పారు. టివిలో వచ్చిన స్క్రోలింగ్‌ను చూసి నానిపై వేటు వేశారని, అది సరికాదని చెప్పారు. పూర్తి సమాచారం అందాకే చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ మీడియా వార్తను బట్టి ఇలా చేయడం తప్పన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు.

నియోజకవర్గ ప్రజలు, తన కార్యకర్తల సూచనల మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. జగన్ పార్టీలోకి వెళతారనుకోవచ్చా అనే ప్రశ్నకు ప్రజా నిర్ణయమే తన నిర్ణయమని చెప్పారు. చిన్నం రామకోటయ్య వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన జగన్ పార్టీలోకి వెళ్లేందుకే సిద్ధపడుతున్నారనిపిస్తోందని అంటున్నారు. తాను ఏ పార్టీలోకి వెళతానో ఇప్పుడే చెప్పలేనని ఆయన చెబుతున్నప్పటికీ మాటలలోని ఆంతర్యం మాత్రం జగన్ వైపు లాగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

కాగా టిడిపికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మొన్న కొడాలి నాని జగన్‌కు జై కొట్టగా నిన్న తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు, దళిత నేత ఉప్పులేటి కల్పన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజీగా ఉన్న సమయంలో కల్పన మంగళవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసినట్లు నిర్ధారణ కావడంతో కల్పనను తెలుగుదేశం పార్టీ మంగళవారం రాత్రి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

English summary
Nuziveedu of Krishna district MLA Chinnam Ramakotaiah supported Gudiwada MLA Kodali Nani on his meeting with YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy and YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X