వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రామాయణ' ఫేమ్, బాలీవుడ్ నటుడు దారాసింగ్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Dara Singh
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు, హనుమంతుడి ఫేమ్ దారా సింగ్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఎనబై మూడేళ్ల దారా సింగ్ ఈ రోజు ఉదయం ఏడన్నర గంటల ప్రాంతంలో ముంబయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా మెదడు, గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస సరిగా అందకపోవడంతో నాలుగు రోజుల క్రితం కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు.

పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకు వెళ్లమని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో ఆయనను ఇంటికి తీసుకు వెళ్లారు. ఆయన కోరిక ప్రకారం ఇంటిలోనే, కుటుంబ సభ్యుల నడుమ కన్నుమూశారు. హనుమంతుడి పాత్రలకు పెట్టింది పేరు. దూరదర్శన్‌లో వచ్చిన 'రామానంద సాగర్' రామాయణ సీరియల్‌లో హనుమంతుడి పాత్ర ధారి ఆయనే. ఈ పాత్ర ఆయనకు ఎంతో పేరు తీసుకు వచ్చింది.

దారాసింగ్ బాలీవుడ్‌లో 1963లో ఆరంగేట్రం చేశారు. ఆయన చివరి చిత్రం జబ్ వియ్ మెట్. సినిమాలలోకి రాకముందు ఆయన రెజ్లర్‌గా పేరు ప్రఖ్యాతులు గాంచారు. మొదటి నుండి రెస్లింగ్ అంటే ఆసక్తి. ప్రముఖ అంతర్జాతీయ రెస్లర్లలో ఒకడిగా పేరు గడించాడు. అయితే కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతో రెస్లింగ్ నుండి తప్పుకున్నాడు. బాలీవుడ్ కండల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఆయన అవతారమెత్తారు.

పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన ధారా సింగ్ వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. కొంతకాలంగా ఆయన పెరాలసిస్‌తోనూ బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన 2003 నుండి 2009 వరకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రాముఖ్యత తెలిసిన పలు పార్టీలు ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చేందుకు పోటీ పడేవని అంటారు.

దారా సింగ్‌కు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అతనిని ఆదర్శంగా తీసుకునే బాలీవుడ్ జనాలు ఉన్నారు. దారా సింగ్‌ది సున్నిత మనస్తత్వం. చాలామందికి ఆర్థికంగా, ఇతరత్ర రూపేణా సహాయం చేశారు. గుప్తదానాలు చేశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ విచారం వ్యక్తం చేస్తోంది. పలువురు నటులు ఆయనకు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయి.

English summary
Veteran actor and legendary wrestler Dara Singh has passed away. Aged 83, Dara Singh died due to a cardiac arrest at around 7:30am. 
 He was hospitalised at the Kokilaben hospital for the last four days but was discharged on Wednesday after the doctors claimed that he had significant brain damage and there was not much they could do on his failing health condition. He was admitted after he suffered a massive cardiac arrest last week. After he was discharged on Wednesday, he was taken to his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X